WATER: తాగునీటి వృథా
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:19 AM
మండల పరిధిలోని మహమ్మదాబాద్ మూడు రోడ్లు కూడలిలో హోటల్ యజమానులు ఏర్పాటుచేసుకున్న తాగునీటి పైప్‌లైన పగిలింది. ఈ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డు పక్కనే తక్కువలోతులో పైప్‌లైన ఉండడంతో ఆ వాహనాలు వెళ్లినప్పుడు పైప్‌లైన పగిలిపోయే అవకాశం ఉంది. గతంలోనూ ఈ సంఘటన జరిగింది.
అమడగూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని మహమ్మదాబాద్ మూడు రోడ్లు కూడలిలో హోటల్ యజమానులు ఏర్పాటుచేసుకున్న తాగునీటి పైప్‌లైన పగిలింది. ఈ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డు పక్కనే తక్కువలోతులో పైప్‌లైన ఉండడంతో ఆ వాహనాలు వెళ్లినప్పుడు పైప్‌లైన పగిలిపోయే అవకాశం ఉంది. గతంలోనూ ఈ సంఘటన జరిగింది. మళ్లీ రెండు రోజులక్రితం పైప్‌లైన పగిలిపోవడంతో రోడ్డుపక్కన తాగునీరు వృథాగా పారుతోంది. దీంతో అటూ ఇటూ వచ్చే వాహనాలు తారు రోడ్డు దిగాలంటే ఇరుక్కు పోతామని భయపడాల్సి వస్తోంది. ఈ రహదారిలో ఎక్కువగా అధిక లోడుతో ఉన్న వాహనాలు వెళ్తుంటాయి. అధికారులు స్పందించి పైపులైన కు మరమ్మతులు చేయాలని, తాగునీటి వృథాను అరికట్టాలని వాహనదారులు, ప్రజలు తెలిపారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి జానకిని వివరణ కోరగా గతంలో పైప్‌లైన పగిలినప్పుడే హోటల్ యజమానులను హెచ్చరించినా తీరు మారలేదని పేర్కొ న్నారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....