Share News

GOD: ఘనంగా విశ్వకర్మ జయంతి

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:03 AM

ప్రపంచపు తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా పేరొందిన విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు విశ్వ కర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు.

GOD: ఘనంగా విశ్వకర్మ జయంతి
ARDSP Srinivasulu garlanding Vishwakarma's portrait

పుట్టపర్తిరూరల్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రపంచపు తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా పేరొందిన విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు విశ్వ కర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఏఆర్‌ డీఎస్పీ మాట్లాడుతూ విశ్వకర్మ వాస్తుశిల్పి మాత్రమే కాదని కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో కార్యాలయం ఏఓ సుజాత, సూపర్డెంట్‌ సరస్వతి, ఆర్‌ఐలు వలి, మహేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:03 AM