RDO: వాల్టాను అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఆర్డీవో
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:39 PM
వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఆర్డీవో వీవీఎస్ శర్మ హెచ్చరించారు. మండలపరిధిలోని దనియానచెరువు పంచాయతీ సోమరాజుకుంట సమీపంలోని నెమళ్లగుట్టలో ఇటీవల మైనింగ్ పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి సోమరాజుకుంట గ్రామస్థులు తీసుకెళ్లారు.
నంబులపూలకుంట, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఆర్డీవో వీవీఎస్ శర్మ హెచ్చరించారు. మండలపరిధిలోని దనియానచెరువు పంచాయతీ సోమరాజుకుంట సమీపంలోని నెమళ్లగుట్టలో ఇటీవల మైనింగ్ పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి సోమరాజుకుంట గ్రామస్థులు తీసుకెళ్లారు. దీనిపై గురువారం ధనియానచెరువు గ్రామ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ... గ్రామస్థులకు ఎటువంటి ఇబ్బందులూ కలు గకుండా మైనింగ్ పనులు చేసుకోవాలన్నారు.
మైనింగ్‌కు అనుమ తులు తీసుకున్న భూమి కాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టప రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా శబ్దం వచ్చే బ్లాస్టింగ్ చేయకూడ దన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే బ్లాస్టింగ్‌లు చేయకూడదన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడు తూ... నెమళ్లగుట్ట ప్రాంతం పశుపోషణకు ఎంతో ఉపయోగపడేదని తె లిపారు. మైనింగ్ పనులు చేపడితే పెద్ద పెద్ద యంత్రాలు ఉపయో గి స్తారని, వాటివల్ల బోరుబావుల్లో నీటిమట్టం ఇంకిపోతుందన్నారు. మై నింగ్‌కు అనుమతులు ఇవ్వకూడదని కోరారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడు తూ... 2018లోనే 12.33ఎకరాలు మైనింగ్‌కు అనుమతులు వచ్చాయని, ఆ భూమి మినహా ఎక్కడ అతిక్రమించినా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మైనింగ్‌కు ఎంత భూమి ఉందో సర్వేల ద్వారా కొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేయిస్తామన్నారు. అయితే ఈ మేరకు సభలో చేసిన తీర్మానంపై గ్రామస్థులు సంతకాలు చేయకుండా వెళ్లిపో యారు. ఈ కార్యక్రమంలో తహీల్దార్ దేవేంద్రనా యక్, పంచాయతీ కార్యదర్శి రెడ్డిభాస్కర్, మైనింగ్ నిర్వాహకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....