GODDESS: వందే వీణా పుస్తకధారిణీ..!
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:49 PM
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా ఏనిమిదో రోజు సోమవారం అమ్మవారిని పలుచోట్ల సరస్వతీ దేవిగా అలంకరించారు. ప్రశాంతినిలయం లోని గాయత్రీ మాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీమాత, ఎనుమల పల్లి దుర్గాదేవి, కొత్తచెరువులోని నాగులకనుమ వద్దగల అలివేలమ్మ సరస్వతిదేవిగా, మామిళ్ళకుంట లలితాపరమేశ్వరి మహా చండీమాతగా దర్శనమిచ్చారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా ఏనిమిదో రోజు సోమవారం అమ్మవారిని పలుచోట్ల సరస్వతీ దేవిగా అలంకరించారు. ప్రశాంతినిలయం లోని గాయత్రీ మాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీమాత, ఎనుమల పల్లి దుర్గాదేవి, కొత్తచెరువులోని నాగులకనుమ వద్దగల అలివేలమ్మ సరస్వతిదేవిగా, మామిళ్ళకుంట లలితాపరమేశ్వరి మహా చండీమాతగా దర్శనమిచ్చారు. అలాగే ధర్మవరం పట్టణంలో శ్రీనివానగర్ వెంకటేశ్వర స్వామి మోహినీ అలంకరణలో, వాసవీమాత, పుట్లమ్మ, గాయత్రీదేవి, ప ద్మావతి దేవి సరస్వతి దేవిగా భక్తులను అనుగ్రహించారు. కదిరి పట్టణం లో చౌడేశ్వరి, కన్యకాప రమేశ్వరి, మరకత మహాలక్ష్మి, కుమ్మరవాండ్లపల్లి మల్లాలమ్మ, బత్తలపల్లిలో అమ్మవారు సరస్వతి రూపంలో కనిపించారు. అలాగే ముదిగుబ్బ, తాడిమర్రి, తనకల్లులో వాసవీ మాత సరస్వతిగా, అమడగూరులో చౌడేశ్వరి మహాగౌరి గా భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....