TOURNAMENT: వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నీ
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:27 AM
ఏ క్రీడలలోనైనా గెలుపోటము లను సమానంగా తీసుకోవాలని డీఎస్పీ హేమంతకుమార్, బీజేపీ నియెజ కవర్గ ఇనచార్జ్ హరీశబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో మంగళవారం అటల్ బిహారీ వాజ్ పేయిస్మారక క్రికెట్ టోర్నీ సీజన-2 పైనల్ మ్యాచ ఉత్కంఠభరితంగా సాగింది. డ్రాగన లెవెన్స జట్టు విజేతగా నిలిచింది. పైనల్ మ్యాచలో డ్రాగన లెవెన్స, హిందూపురం హంటర్స్ జట్లు తలపడ్డాయి.
విజేత డ్రాగన లెవెన్స
ధర్మవరం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఏ క్రీడలలోనైనా గెలుపోటము లను సమానంగా తీసుకోవాలని డీఎస్పీ హేమంతకుమార్, బీజేపీ నియెజ కవర్గ ఇనచార్జ్ హరీశబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో మంగళవారం అటల్ బిహారీ వాజ్ పేయిస్మారక క్రికెట్ టోర్నీ సీజన-2 పైనల్ మ్యాచ ఉత్కంఠభరితంగా సాగింది. డ్రాగన లెవెన్స జట్టు విజేతగా నిలిచింది. పైనల్ మ్యాచలో డ్రాగన లెవెన్స, హిందూపురం హంటర్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన డ్రాగన లెవెన్స జట్టు 158 పరుగులు చేసింది. తరువాత బరిలోకి దిగిన హిందూపురం హంటర్స్ జట్టు 108 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 50 పరుగుల తేడాతో డ్రాగన లెవెన్స జట్టు విజేతగా నిలిచింది. విన్నర్ జట్టుకు రూ. లక్ష చెక్కు, ట్రోఫీని, రన్నర్ జట్టుకు రూ. 50వేల చెక్కును డీఎస్పీ హేమంత కుమార్, హరీశబాబు అందజేశారు. అదేవిధంగా ఈ మ్యాచలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మార్కెట్‌యార్డ్ చైర్మన అంబటిఅరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....