GAMES: ఉత్కంఠ భరితంగా వాజ్‌పేయి క్రికెట్ టోర్నీ
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:52 PM
పట్టణంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నీ సీజన-2 పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. మొదటి మ్యాచలో నాయక్ వారియర్స్, చత్రపతి శివాజీ లెవన్స జట్లు తలపడగా ఇందులో 28 పరుగుల తేడాతో నాయక వారి యర్స్ జట్టు గెలిచింది. రెండో మ్యాచలో కొత్త చెరువు గాంధీనగర్ లెవన్స జట్టుపై బసంపల్లి జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ధర్మవరం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నీ సీజన-2 పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. మొదటి మ్యాచలో నాయక్ వారియర్స్, చత్రపతి శివాజీ లెవన్స జట్లు తలపడగా ఇందులో 28 పరుగుల తేడాతో నాయక వారి యర్స్ జట్టు గెలిచింది. రెండో మ్యాచలో కొత్త చెరువు గాంధీనగర్ లెవన్స జట్టుపై బసంపల్లి జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచలలో ప్రతిభ కనబరచిన పరశురాం, సో ముకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ అవార్డులను అందజేశారు. కోచలు రాజశేఖర్, పృథ్వీ, బీ.జేపీ నాయకులు శ్యామరావు, పోతుకుంట రాజు, సోమ్లానాయక్, చిన్నలింగమయ్య, పోతుకుంట శ్రీనివాసులు, కోళ్లమొరం భాస్కర్ రెడ్డి, రమేశ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....