Share News

VACANT CHAIRS: గ్రామ సచివాలయాల్లో ఖాళీ కుర్చీలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:20 AM

మండల కేంద్రంలోని సచివాల యం-3లో డిజిటల్‌ అసిస్టెంట్‌, పంచాయతీ సెక్రటరీ, వెల్పేర్‌అసిస్టెంట్‌, ఏఎనఎం, మహిళా పోలీసు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు డెప్యుటేషనపై కలెక్టరేట్‌కు, డీపీఓ కార్యాలయానికి వెళ్లినట్లు సమా చారం. దీంతో వివిధ పనులపై సచివాలయానికి వచ్చే సంబంధిత సిబ్బం ది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

VACANT CHAIRS: గ్రామ సచివాలయాల్లో ఖాళీ కుర్చీలు
Vacant chairs in Kothacheruvu Secretariat-3

-డెప్యుటేషనపై వెళ్లిన వారు కొందరు

- సమయపాలన పాటించని మరికొందరు

- సేవలు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

కొత్తచెరువు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సచివాల యం-3లో డిజిటల్‌ అసిస్టెంట్‌, పంచాయతీ సెక్రటరీ, వెల్పేర్‌అసిస్టెంట్‌, ఏఎనఎం, మహిళా పోలీసు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు డెప్యుటేషనపై కలెక్టరేట్‌కు, డీపీఓ కార్యాలయానికి వెళ్లినట్లు సమా చారం. దీంతో వివిధ పనులపై సచివాలయానికి వచ్చే సంబంధిత సిబ్బం ది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో నాలుగు సచివాలయాలు ఉండగా సోమవారం మూడో సచివాలయంలో పంచా యతీ సెక్రటరీ, డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్పేర్‌ అసిస్టెంట్‌, ఏఎనఎం మహిళా పోలీసు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇక నాలుగోసచివాలయంలోని వీఆర్‌ఓ రజితబార్గవ్‌ను ఆర్డీఓ కార్యాలయానికి డెప్యుటేషనపై వేశారు. దీం తో ఆ సచివాలయంలో వీఆర్‌ఓ లేకపోవడంతో రైతులు, ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. మిగిలిన వారు హాజరు కాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. సచివాల యాల్లో పనిచేసే వీఆర్‌ఓలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సచివాలయాలకు రాకుండా తహసీల్దార్‌ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తుండటంతో వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పనులు జరగక అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై ఇనచార్జ్‌ ఈఓఆర్‌డీ అశోక్‌కుమార్‌ను వివరణ కోరగా...


సచివాలయ ఉద్యోగులు తప్పక సమయ పాలన పాటించాలన్నారు. అలా విధులకు రాకపోతే వారిపై శా ఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తాము కూడా సచివాలయాలను తనిఖీ చేస్తున్నామని ఎక్కడైనా విధులకు హాజరుకాని వారికి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. చాలా మంది వీఆర్‌ఓలు సచివాలయా లకు రావడంలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. మూడు, నాలుగు సచివాలయాల వీఆర్వోలను, మూడో సచివాలయంలోని పలువురు సిబ్బందిని ఉన్నతాధికారులు డెప్యుటేషనపై నియమించుకున్నా రని తెలిపారు. ఇక్కడి ఇబ్బందులను ఉన్నతాధికారులకు తెలియజేశామని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇదిలాఉండగా సచివాలయం ఎదుటే చెత్తకుప్ప పేరుకుపోయింది. వర్షానికి ఆ చెత్త కుళ్లి పోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. సచివాలయానికి వచ్చే ప్రజలు ఆ దుర్వాసనను భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సచివాలయం ఎదుటే ఇలా చెత్త పేరుకుపోతే సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సచివాలయం ఎదుటే ఇలా ఉంటే గ్రామంలో పరిస్థితి ఏమిటని ప్రజలు వాపోతున్నారు.

నంబులపూలకుంట: మండలంకేంద్రంలోని 1, 2 సచివాలయాల్లో సిబ్బంది సోమవారం హాజరుకాకపోవడంతో, వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. సచివాలయం-2లో వీఏఏ ఒక్కరే ఉన్నారు. సచివాలయం-1లో సిబ్బంది ఎవరూలేరు. ఈ విషయాన్ని డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా ఆయన 10.50నిమిషాలకు సచివాలయం-1కు వెళ్లి, సిబ్బందిని ఫోనద్వారా సమాచారం అడిగారు. ఎంపీడీఓ రావడానికి ఐదు నిమిషాల ముందు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఒక్కరే హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శి వేళకు హాజరుకాపోవడంతో మిగిలిన సిబ్బంది సమయ పాలన పాటించడంలే దని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఎంపీడీఓ రిజిస్టర్లను పరిశీలించి, ఆరుగురి సంతకాల వద్ద రిమార్క్స్‌ రాశారు. సెలవుపై వెళ్లి ఉంటే తప్పకుండా సెలవు చీటి ఉండాలని, అనుమతి లేనిదే సెలవు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమయపాలన పాటించకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 19 , 2025 | 12:20 AM