UTURN: యూటర్న్ లేక ఇబ్బందులు
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:21 AM
పట్టణానికి శివారు ప్రాంతంలో ఉన్న వివిధ కార్యాలయాల వద్ద యూటర్న్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి గట్లు ప్రాం తంలోని వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వరకు ఇటీవల నిర్మించిన నాలుగురోడ్ల రహదారిలో ఎక్కడా యూ టర్న్ లేదు. దాదాపు ఒకటిన్నర కిలోమీటరు వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది.
కదిరి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పట్టణానికి శివారు ప్రాంతంలో ఉన్న వివిధ కార్యాలయాల వద్ద యూటర్న్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి గట్లు ప్రాం తంలోని వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వరకు ఇటీవల నిర్మించిన నాలుగురోడ్ల రహదారిలో ఎక్కడా యూ టర్న్ లేదు. దాదాపు ఒకటిన్నర కిలోమీటరు వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఈ మధ్యలోనే ఎంపీ డీఓ, వెలుగు, డీఎస్పీ, ఆర్డీఓ కార్యాలయాలతో పాటు దాదాపు వెయ్యికిపైగా టిడ్కోఇళ్లు, ఆర్‌అండ్ ఆర్ కాలనీలు ఉన్నాయి. వీరందరూ రహదారిలోని ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలంటే గట్లు వరకు వెళ్లి తిరిగి రావాలి. లేదా అదే రోడ్లు వ్యతిరేక దిశలో వెళ్లాల్సి ఉంది. ఇలా చేస్తే ప్రమాదాలు జరి గే అవకాశ ముంది. వెంటనే వివిధ కార్యాలయాల వద్ద, టిడ్కో ఇళ్ల వద్ద యూటర్న్‌లు ఏర్పా టు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....