WATER: నిరుపయోగంగా నీటి శుద్ధి కేంద్రాలు
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:58 AM
ప్రజల ఆరోగ్యం బాగు కోసం ఫ్లోరైడ్ రహిత నీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకా న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంక్రింద రూ. 2లకు 20 లీటర్ల శుద్దినీటిని పంపిణీచేసే విధంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఓబుళదేవరచెరువు సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద తాగునీ టి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యంత్రాలను సమకూర్చింది.
నిరుపయోగంగా నీటి శుద్ధి కేంద్రాలు
ఓబుళదేవరచెరువు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యం బాగు కోసం ఫ్లోరైడ్ రహిత నీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకా న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంక్రింద రూ. 2లకు 20 లీటర్ల శుద్దినీటిని పంపిణీచేసే విధంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఓబుళదేవరచెరువు సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద తాగునీ టి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యంత్రాలను సమకూర్చింది. అప్పట్లో ప్ర ధాన పంప్‌హౌస్ నుంచి బోగానిపల్లి వద్ద ఏర్పాటుచేసిన ఉపకేంద్రం ద్వారా గ్రామాలకు నీరు సరఫరా చేసే విధంగా ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి బాబాసాహేబ్‌పల్లి, తుమ్మలకుంటపల్లి తదితర గ్రామాల్లో శుద్ధి నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ రూ. 2 కాయినను బాక్స్‌లో వేస్తే నీరు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే గత వైసీ పీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో ఆ కేం ద్రం ప్రారంభానికే నోచుకోలేదు. శుద్ధి జల కేంద్రంలో యంత్రాలు తుప్పు పట్టి నిరూపయోగంగా మారా యి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేయ డంతో ప్రజలు నీటికి ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. గడిచిన ఐదు సంవత్సరాల నుంచి నీటి ట్యాంక్‌ల ద్వారా వచ్చే నీటిని బిందె రూ. 10 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ఫ్లోరైడ్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఫ్లోరైడ్‌తో మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేకపోవడంతో గ్రామాలకు వచ్చే నీటి ట్యాంక్‌ల ద్వారా రూ. 10తో బిందె నీరు కొనుగోలు చేస్తున్నారు. స్థోమత లేనివాళ్లు స్థానకంగా వచ్చే నీటిని వాడుతూ ఫ్లోరైడ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పులతో యువకు లు సైతం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2018లో తెలుగుదేశం ప్రభుత్వం శుద్ధమైన నీరు అందించాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఏమ్రాతం పట్టించుకోలేదు. దీంతో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తే గ్రామీణులకు నీటి కష్టాలు, ఫ్లోరైడ్ సమస్యలు తీరుతాయని ప్రజలు అంటున్నారు.
శుద్ధినీరు అందించాలి -కె. రామాంజినేయులు, బాబాసాహేబ్ పల్లి
ఫ్లోరైడ్ పీడత గ్రామాలకు శుద్ధినీరు అందించే కార్యక్రమాన్ని తిరిగి చేపట్టాలి. గతంలో టీడీపీ ప్రభుత్వం శుద్ధినీటిని అందించేందుకు ఎన్టీ ఆర్ సుజల పథకాన్ని పెట్టినా, దానిని వైసీపీ ప్రభు త్వం గత ఐదేళ్లు విస్మరించింది. ఇప్పటికైనా అధి కారులు స్పందించి శుద్ధి చేసిన నీటిని గ్రామాలకు అందించాలి.
నొప్పులతో అల్లాడిపోతున్నాం- రెడ్డిపల్లి సరస్వతమ్మ, నారప్పగారిపల్లి
శుద్ధినీరు సరఫరా కాకపోవడంతో ఫ్లోరైడ్ సమ స్యతో నొప్పులకు అల్లాడిపోతున్నాం. ఆ బాధలు పడలేక ట్యాంక్‌ల ద్వారా రూ. 10 పెట్టి శుద్ధినీరు కొంటున్నాం. ప్రభుత్వం శుద్ధి జల కేంద్రాన్ని వి నియోగంలోకి తీసుకొస్తే ఖర్చుల భారం తగ్గడంతో పాటు పరిశుద్ధమైన తాగు నీరు అందుతుంది.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....