TANK: నిరుపయోగంగా నీటి ట్యాంకులు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:12 AM
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండకూడదని ప్రతి గ్రామంలో ప్రభుత్వం బోర్లు, పైపులైన, మోటార్లు, తాగునీటి ట్యాంక్ తదితరా లను ఏర్పా టు చేస్తోంది. వీటి నిర్వాహణ కోసం పంచాయతీ అధికారులతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను నియమించింది. అయితే గతంలో నీటి ట్యాంక్‌లు, పైపులు, బోర్లకు చిన్నపాటి మరమ్మతులను అధికారులు పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు.
పాతవి వదిలేసి, కొత్త ట్యాంక్‌ల నిర్మాణం
రూ. లక్షల్లో ప్రజాధనం వృఽథా
గాండ్లపెంట, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండకూడదని ప్రతి గ్రామంలో ప్రభుత్వం బోర్లు, పైపులైన, మోటార్లు, తాగునీటి ట్యాంక్ తదితరా లను ఏర్పా టు చేస్తోంది. వీటి నిర్వాహణ కోసం పంచాయతీ అధికారులతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను నియమించింది. అయితే గతంలో నీటి ట్యాంక్‌లు, పైపులు, బోర్లకు చిన్నపాటి మరమ్మతులను అధికారులు పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. కొత్తవాటి కోసం ప్రతిపాదనలు పంపుతు న్నారు. కొత్తవి ఏర్పాటు చేసి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. దీంతో గతంలో నిర్మించిన ట్యాంక్‌లు నిరుపయో గంగా మారి ప్రజాధనం వృథా అవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాగునీటి కోసం రూ. లక్షలు ఖర్చు
మండల వ్యాప్తంగా 14 పంచాయతీల్లో వంద గ్రామాలున్నాయి. దాదాపు 30మంది కిపైగా జనాభా ఉన్నట్లు జనాభా ఉన్నట్లు అధికారిక లె క్కలు చెబుతున్నాయి. ప్రతి గ్రామంలో జనాభాకు అనుగుణంగా తాగునీ టి బోర్లు వేస్తున్నారు. ఈ మేరకు మండలంలో 129 బోరుబావులున్నాయి. అలాగే పలు గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, భూమికి సమాంతరంగా నిర్మించిన 31 ట్యాంక్‌లు ఉన్నాయి. అయితే అవి చిన్నపాటి మరమ్మత్తులకు గురికావడంతో వాటికి నీరు నింపడం లేదు. దీంతో గాండ్లపెంట, కటారుపల్లి తదితర గ్రామాల్లో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన ట్యాంక్‌లు నిరుపయోగంగా మారుతున్నాయి.
నూతన ట్యాంక్‌ల కోసం ప్రతిపాదనలు
మండలంలో జలజీవన పథకం కింద గాండ్లపెంట, తూపల్లి, వేపరాల, సీఎంతండా, గాజువారిపల్లి పెద్దతండా, కమతంపల్లి, బనానచెరువుపల్లి, కురమామిడిలో నూతన ట్యాంక్‌లు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. 20వేల లీటర్ల సామర్థ్యంతో ఆరు, 40వేల లీటర్ల సామఽర్ధ్యంతో మూడు చొ ప్పున మొత్తం తొమ్మిది ట్యాంకుల కోసం ప్రతిపాదనలు వెళ్లాయి. 20 వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి రూ.19లక్షలు, 40వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణాని కి రూ.33లక్షల నుంచి రూ. 37లక్షల వరకు అంచనా వేశారు. టెండర్ల ద్వా రా నిర్మాణానికి ప్రభుత్వం అనుమతువ్వడంతో పనులు జరుగుతున్నాయి.
గాండ్లపెంటలో ఇలా...
గాండ్లపెంటలో పంచాయతీ, సత్యసాయి ట్యాంక్‌లతో పాటు భూమికి సమాతరంగా నిర్మించిన మరో రెండు ట్యాంక్‌లు ఉన్నాయి. మొత్తం 1.50 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ నాలుగు ట్యాంక్‌లను ఐదేళ్లనుంచి ఉపయోగించకపోడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. గతంలో చెత్త సంపద కేంద్రం వద్ద తాగునీటికోసం బోరు వేయించి, దాని నుంచి గాండ్లపెంట ప్రజలకు నీరు అందించేవారు. అయితే ప్రస్తుతం అదే బోరు పక్కన మరో బోరు వేసి, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తుండడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇలా నిధులు దుర్వినియోగం చేయడం ప్రజలపై భారాలు మోపడమేనని ప్రజలు అంటున్నారు. పాత వాటికి చిన్నచిన్న మరమ్మతులు చేసి వినియోగంలోకి తేస్తే, ప్రజలకు అన్నివే ళ్లల నీరు అందుబాటులో ఉంటుందని గాండ్లపెంట, కటారుపల్లి తదితర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ట్యాంక్‌లను వినియోగంలోకి తెస్తాం- కిరణ్‌కుమార్‌రెడ్డి, జేఈ, ఆర్‌డబ్ల్యూఎస్
గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న వివిధ రకాల ట్యాంక్‌లకు చిన్నపాటి మరమ్మతులు చేయిస్తాం. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచలతో చర్చించి, వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....