HOSTEL: నిరుపయోగంగా హాస్టల్ భవనాలు
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:22 AM
మండలకేంద్రానికి సమీపంలో రాచువారిపల్లికి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఆ రువైపుల ప్రభుత్వం వివిధ హాస్టల్ భవనాలను నిర్మించింది. బీసీ బాలికల, ఎస్సీ బాలిక, బాలుర, ఎస్టీ బాలుర హాస్టళ్లను రూ. కోట్లు ఖర్చు చేసి గతంలో నిర్మించారు. వాటికి ప్రహరీ నిర్మించి, గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్న వైనం
తనకల్లు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రానికి సమీపంలో రాచువారిపల్లికి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఆ రువైపుల ప్రభుత్వం వివిధ హాస్టల్ భవనాలను నిర్మించింది. బీసీ బాలికల, ఎస్సీ బాలిక, బాలుర, ఎస్టీ బాలుర హాస్టళ్లను రూ. కోట్లు ఖర్చు చేసి గతంలో నిర్మించారు. వాటికి ప్రహరీ నిర్మించి, గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. దీంతో మండలం నుంచే కాకుండా నల్లచెరు వు, అమడగూరు, గాండ్లపెంట, నంబులపూలకుంట నుంచి, సమీప అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు, పెద్దతిప్పసముద్రం, తంబళ్లపల్లి, బురకాలయకోట, ప్రాంతాల నుంచి వందలాది మంది బాల బాలికలు ఈ హాస్టల్లో సీట్లు సంపాదించి, చదువుకునే వారు. అయితే ఉన్న ట్లుండి హాస్టల్‌ల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవ డంతో పదేళ్ల క్రితం ఎస్సీ బాలుర హాస్టల్‌ను మూసివేశారు. క్రమంగా ఎస్సీ బాలికల, ఎస్టీ బాలుర హాస్టల్‌ను మూసివేశారు. గత యేడాది వరకు కొనసాగిన బీసీ బాలికల హాస్టల్‌ను ఈ యేడాది మూసివేశారు. దీంతో రూ. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భవ నాలు ఖాళీగా ఉన్నాయి. అవి కాస్త చట్టవ్యతిరేక కార్య కలాపాలకు కేంద్రా లుగా మారిపోయాయని ఆ దారి వెంట వెళ్లే పలు గ్రా మాల ప్రజలు వాపోతున్నారు. రూ. కోట్లు విలువ చేసే భవనాలను అలా గాలికొదిలేసి, కొత్త భవనాల నిర్మాణంలో ప్రభుత్వం నిమగ్నమండం ఎందుకో అర్థంకావ డం లేదని అంటున్నారు. తనకల్లు గ్రామ సచివాల యం-1ని చాలీచాలని భవనంలో, సచివాలయం -2ను అద్దె భవనంలో నిర్వ హిస్తున్నారు. వృఽథాగా పడి ఉన్న ప్రభుత్వ భవనాలను ఉపయోగించుకోకుండా... అధికారులు ఇలా ఎందుకు నిర్వహిస్తున్నారో అని ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న మండలాల్లో సైతం హాస్టళ్లు కొనసాగు తుండగా, జిల్లాలోనే అది పెద్ద మండలంగా పేరున్న తనకల్లులో ఒక్క హాస్టల్ కూడా లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా సంబంధితాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తనకల్లులో ని హాస్టళ్ల భవనాలను గ్రామ సచివాలయాకు గానీ, కదిరిలో నిర్వహిస్తున్న ఎస్టీ బాలికల కళాశాలకు కానీ ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....