Share News

MLA: సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:33 AM

మారుతు న్న కాలానికి అనుగు ణంగా విద్యార్థు సాంకేతిక విజ్ఞానాన్ని సక్రమం గా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ సూచించారు. ఆయన శుక్రవారం కదిరి పట్టణంలోని బాలికల జూని యర్‌ కళాశాల, నల్లచెరువు మండలంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌, తనకల్లు మండలపరిధిలోని సీజీ ప్రాజెక్టు వద్ద ఉన్న గిరిజన బాలిక ల గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

MLA: సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
MLA Kandikunta serving lunch to the students

ఎమ్మెల్యే కందికుంట

కదిరి/నల్లచెరువు/తనకల్లు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): మారుతు న్న కాలానికి అనుగు ణంగా విద్యార్థు సాంకేతిక విజ్ఞానాన్ని సక్రమం గా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ సూచించారు. ఆయన శుక్రవారం కదిరి పట్టణంలోని బాలికల జూని యర్‌ కళాశాల, నల్లచెరువు మండలంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌, తనకల్లు మండలపరిధిలోని సీజీ ప్రాజెక్టు వద్ద ఉన్న గిరిజన బాలిక ల గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కదిరి కళాశాలలో విద్యార్థినులకు భోజనం వడ్డించారు.నల్ల చెరువు ఏపీ మోడల్‌ స్కూల్‌ లో విద్యార్థుల కోసం ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటుచేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రాంభిం చారు. ఆయా కార్యక్రమాల్లో కదిరి కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్‌ ప్రసాద్‌, ఆర్డీవో వీవీఎస్‌ శర్మ, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన డైరెక్టర్‌ ఫర్వీనా బాను, మున్సిపల్‌ చైర్‌పర్సన దిల్షాదున్నీషా, మండలాల అధికారులు టీడీపీ నాయకులు ఎద్దుల క్రిష్ణమూర్తి, తొట్లి రెడ్డిశేఖర్‌రెడ్డి, తోట సరోజమ్మ, ఈశ్వర్‌రెడ్డి, శంకర్‌నాయుడు, రాజారెడ్డి, ఆనంద్‌రెడ్డి, సోం పాలెం నాగభూషణం, బాగేపల్లి చలపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:33 AM