CROPS: యూరియా కొరత
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:37 AM
అసలే అరకొరగా వస్తున్న నీరు... ఆ పై ఎరువుల కొరత... రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోం ది. ఖరీఫ్ సీజనలో సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు యూరి యా వాడకం అధికంగా ఉంటుంది. నెలకు ఒకమారు చొప్పున తక్కువ మోతాదులో యూరియాను పంటలకు వేస్తుంటారు. కానీ మండల రైతులకు ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదు.
- గోదాములున్నా నిల్వ శూన్యం
- పక్క మండలాలకు వెళ్తున్న రైతులు
తాడిమర్రి. నవంబరు 8(ఆంధ్రజ్యోతి): అసలే అరకొరగా వస్తున్న నీరు... ఆ పై ఎరువుల కొరత... రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోం ది. ఖరీఫ్ సీజనలో సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు యూరి యా వాడకం అధికంగా ఉంటుంది. నెలకు ఒకమారు చొప్పున తక్కువ మోతాదులో యూరియాను పంటలకు వేస్తుంటారు. కానీ మండల రైతులకు ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదు. నెల రోజుల క్రితం యూరియా అందుబాటులో లేదంటూ రైతులు గగ్గోలు పెట్టడంతో.. జిల్లా వ్యాప్తంగా అఽధికారులు ఆయా గ్రామ సచివాలయాల పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో అందు బాటులో ఉంచారు. అలాగే డీఏపీ, 10-26-26 ఎరువులను కూడా సరఫరా చేశారు. ఆ నిల్వ కాస్తా అయిపోగానే మళ్లి కొత్తగా తెప్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎరువులను నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే గోదాములు సిద్ధంగా ఉన్న వాటిని ఉపయోగించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినవస్తు న్నాయి. మండల కేంద్రంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఎరువులను నిల్వ చేసుకుని రైతులకు పంపిణి చేసేందుకు అవసరమయ్యే గోదాములను రూ.40లక్షల వ్యయంతో నిర్మించారు. కానీ ఇంతవరకు ఈ ఏడాది ఒక్క బస్తా ఎరువు కూడా వాటి ద్వారా పంపిణీచేయలేదు. అలాగే మండల వ్యాప్తంగా తొ మ్మిది రైతు సేవా కేంద్రాలుండగా... ఒక పిన్నదరి రైతు సేవా కేంద్రంలో మాత్రమే అరకొరగా యూరియా అందుబాటులో ఉంది. మండల స్థాయి అధికారులు రైతులపై కాస్త శ్రద్ద ఉంచి రైతు సేవా కేంద్రాల్లో యూరియాతో పాటు ఇతర ఎరువులను, పురుగుల మందులను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....