ELECTRICITY: వేళపాళ లేని విద్యుత కోతలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:14 AM
వేళ పాళలేని విద్యుత కోతలతో అవస్థలు పడుతున్నామని మహమ్మదాబాద్ పంచాయతీ లోని ఐదు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని మహమ్మదాబాద్ సబ్‌స్టేషనలో పంచాయతీలోని ఐదు గ్రామాల ప్రజలు శుక్రవారం స్థానిక విద్యుత సబ్‌స్టేషన వద్ద నిరసన వ్యక్తం చేశారు.
మహమ్మదాబాద్ పంచాయతీ ప్రజల మండిపాటు
అమడగూరు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): వేళ పాళలేని విద్యుత కోతలతో అవస్థలు పడుతున్నామని మహమ్మదాబాద్ పంచాయతీ లోని ఐదు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని మహమ్మదాబాద్ సబ్‌స్టేషనలో పంచాయతీలోని ఐదు గ్రామాల ప్రజలు శుక్రవారం స్థానిక విద్యుత సబ్‌స్టేషన వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గురువారం నుంచి 24గంటల పాటు విద్యుత సరఫరా లేకపోవ డంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. చినుకురాలితే కరెం టు కట్ చేస్తారన్నారు. విద్యుత సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు కట్టడం ఒక్కరోజు ఆలస్యమైతే రూ. వంద అపరాధ రుసుం వసూలు చేస్తారని, కరెంటు ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తు న్నారని అధికారులపై మండిపడ్డారు. సంబంధిత అధికారులకు ఫోన చేసినా స్ప్పందించడంలేదని మండిపడ్డారు. గత యేడాదిగా ఇదే సమస్య ఎదరవుతోందని ఆవేదన చెందారు. ఈ విషయంపై ఏఈ చంద్రనాయక్‌ను వివరణ కోరగా... రెండు ఫీడర్లు మరమ్మ తుల్లో ఉన్నాయని, వాటిని మరమ్మత్తులు చేయడానికి సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. మరమ్మతులు పూర్తి అయిన వెంటనే కరెంటు సరఫరా చేస్తామన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....