Share News

UNSANITARY: అపరిశుభ్రంగా కాలనీలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:05 AM

మేజర్‌ పంచాయతీలోని పలు కాలనీల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు అస్తవ్యస్తంగా రోడ్లుపైనే పారుతోంది. దీంతో కాలనీల్లోని వీధుల్లో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బెడద ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మండలకేంద్రంలోని విజయలక్ష్మీ కాలనీ, అంబేడ్కర్‌ కాలనీ, నూరుద్దీన కాలనీల్లో ఈ పరిస్థితి నెలకొంది.

UNSANITARY: అపరిశుభ్రంగా కాలనీలు
Sewage standing in front of the house in Vijayalakshmi Colony

రోడ్లపై మురుగు, వర్షపు నీటి నిల్వలు

దుర్వాసన, దోమలతో ప్రజలకు ఇబ్బందులు

నల్లచెరువు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మేజర్‌ పంచాయతీలోని పలు కాలనీల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు అస్తవ్యస్తంగా రోడ్లుపైనే పారుతోంది. దీంతో కాలనీల్లోని వీధుల్లో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బెడద ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మండలకేంద్రంలోని విజయలక్ష్మీ కాలనీ, అంబేడ్కర్‌ కాలనీ, నూరుద్దీన కాలనీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా కాలనీల్లో అధికారులు తూతూ మంత్రంగా పారిశుధ్య పనులు చేయిస్తున్నారని, కార్మి కులు కూడా చెత్త తొలగించండంలేదని కాల నీవాసులు వాపోతున్నారు. కాలువల్లో చెత్త పేరుకు పోయి రోడ్లుపై మురుగు పారుతోంది. కొన్ని కా లనీల్లో మురుగునీటి కాలువలు లేవు.

ఆయా కాలనీల్లో ఇలా....

నూరుద్దీన కాలనీలో మురుగునీటి కాలువలో చెత్తచెదారం పేరుకుపో యింది. దీంతో మురుగు నీరు రోడ్డుపై పారుతుండడంతో దుర్వాసన వ స్తోంది. అలాగే వర్షాలు కురిసినప్పుడు కరెంటు ఉండకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. విజయలక్ష్మి కాలనీలో మురుగు కాలువలు దెబ్బతిన్నాయి. దీంతో మురుగునీరు రోడ్డుపైన, ఇళ్లమధ్యలో వెళ్తుం డడం తో దుర్వాసన వస్తోంది. వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు మురుగునీటితో చేరి రోడ్లపై పారుతోంది. కాలనీ చివరిలో మురుగునీటి కాలు వ వద్ద చెత్తచెదారంతో పాటు కంపచెట్లు పెరిగిపోయాయి. దీంతో మురు గు ముందుకు కదలడంలేదు. మురుగు నిలువ ఉండడంతో విషజ్వరాల బారిన పడాల్సి వస్తోందని ఆ కాలనీ వాసులు ఆందోళన చెందుతు న్నారు. అధికారులకు సమస్యలు చెప్పినా, అప్పడు మాత్రం వచ్చి ఒక వీధిలో మాత్రంలో పారిశుధ్య పనులుచేసి, కాలనీలో నిలువ ఉన్న చెత్తచెదారం తొలగించడంలేదని మండిపడుతున్నారు. మురుగునీరు నిలువ ఉండడం తో పక్కనే ఉన్న జిల్లాపరిషత ఉన్నతపాఠశాల ప్రహరీ కూలిపోయింది. దీంతో విద్యార్థులు దుర్వాసన భరించలేకపోతున్నట్లు వాపోతున్నారు. పగటిపూత దోమలు స్వైరవిహారం చేస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. దుర్వాసన భరించలేక ఆప్రాంత వాసులు భోజనం తయారుచేసుకుని, మరో వీధిలో బంధువులు, ఇళ్లలో భోజనం చేస్తున్నట్లు ఆవేదన చెందారు.


ఇంత దుర్వాసన వస్తుంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సమస్య త్రీవతను గురించి అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు. అదేవిధంగా చిరు జల్లులు పడినా అంబేడ్కర్‌ కాలనీ జలమయం అవుతుంది. నాలుగురోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కాలనీలో నీరు నిలువ ఉంది. దీంతో వృద్ధులు, చిన్నారులు రోడ్లపై నడవడానికి వీలు లేకుండా పోతుందని కాలనీవాసులు వాపోతున్నారు. కొన్నిచోట్ల మురుగునీటి కాలవలు లేకపోవడంతో రోడ్లుపైనే మురుగునీరు, వర్షపు నీరు నిలువ ఉంది. దీంతో దోమలు వృద్ధి చెందాయని, దీంతో చిన్నారులు, వృద్ధులు వ్యాధుల బారిన పడితే రూ.15వేలనుంచి 20వేలదాకా ఖర్చు చేసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము కూలి చేసుకుని బతికేవాళ్లమని, అంత ఆర్తిక స్థోమత లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సమస్యలను పరిష్కరిస్తాం-నరేష్‌, పంచాయతీ కార్యదర్శి

నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు మురుగునీటి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులు చెత్తను శుభ్రం చేస్తున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. విజయల క్ష్మీకాలనీలోని మేజర్‌ సమస్యను మూడురోజుల్లో పరిష్కరించేందుకు కృషిచేస్తాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 15 , 2025 | 12:05 AM