TANK: ట్యాంక్‌ల వద్ద అపరిశుభ్రం
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:42 AM
పంచాయతీ అధికా రులు, పాలకుల నిర్లక్ష్యా నికి అద్దంపట్టే విధంగా మండలంలోని వేపరాల్ల గ్రామంలోని తాగునీటి ట్యాక్ దర్శనమి స్తోందని గ్రామ స్థులు విమర్శిస్తున్నారు. వేపరాల్ల పంచాయతీలో సుమారు వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని పంచాయతీ తాగునీటి ట్యాంక్ నీటినే వారు తాగడానికి వినియోగిస్తారు.
గాండ్లపెంట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ అధికా రులు, పాలకుల నిర్లక్ష్యా నికి అద్దంపట్టే విధంగా మండలంలోని వేపరాల్ల గ్రామంలోని తాగునీటి ట్యాక్ దర్శనమి స్తోందని గ్రామ స్థులు విమర్శిస్తున్నారు. వేపరాల్ల పంచాయతీలో సుమారు వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని పంచాయతీ తాగునీటి ట్యాంక్ నీటినే వారు తాగడానికి వినియోగిస్తారు. ఆ తాగునీటి ట్యాంక్‌ను ప్రతి 15 రోజులకు లేదా నెలకు ఒకసారి అయినా శుభ్రం చేసే బాధ్యత పంచాయతీ అధికారులకు, పాలకు లపై ఉంటుంది. దీనిని పై అధికారులు కూడా పర్యవేక్షించాలి, అ యితే అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం వల్ల వేపరాలలోని తాగునీటి ట్యాంక్‌ను ఏడాది ఒక సారి కూడా శుభ్రం చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పంచాయతీలో వివిధ అభివృధ్ది పనులకు నిధు లు అందిస్తున్నా నిత్యం గ్రామానికి తాగునీరు అందించే ట్యాంక్ శుభ్రతపైన కూడా నిర్లక్ష్యం వహిస్తుం డడం శోచనీయమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అపరిశు భ్రంగా ఉంటే ప్రజలు అనారోగ్యాల భారిన పడి ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు. ఈ ఏడాది కూడా వేపరాల్ల పంఛాయతీకి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4 లక్షలకు పైగా విడుదలయ్యాయని, ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంక్‌లతో పాటు పరిసరాలను శుభ్రం చేసి ప్రజలు రోగాల భారినపడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....