ELECTRIC : పరిష్కారం కాని విద్యుత కష్టాలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:58 PM
అప్రకటిత విద్యుత కోతలతో మం డల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో తరచూ విద్యుత అంతరాయం ఏర్పడుతోంది. దోమలతో చిన్నారులు, వృద్ధులు వ్యాధి బారిన పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత కోతలపై అధికారులను ప్రశ్నించినా, వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
అప్రకటిత కోతలతో ప్రజలకు ఇక్కట్లు
కొన్నేళ్లుగా ఇనచార్జ్‌ల పాలతో తీరని సమస్యలు
కంచె లేకుండా ప్రమాదకరంగా ట్రాన్సఫార్మర్లు
నల్లచెరువు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): అప్రకటిత విద్యుత కోతలతో మం డల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో తరచూ విద్యుత అంతరాయం ఏర్పడుతోంది. దోమలతో చిన్నారులు, వృద్ధులు వ్యాధి బారిన పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత కోతలపై అధికారులను ప్రశ్నించినా, వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షం పడినా వేళపాళ లేకుండా రాత్రి సమ యంలో అప్రకటితంగా ఎప్పుడు బడితే అప్పుడు విద్యుత కోతలు విధిస్తున్నారు. కొన్ని హెల్ప్‌లైన నంబర్లు ఉన్నా, అవి పనిచేయడంలేదు. విద్యుత కోతలతో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ప్రజలకు సేవలు అందడంలేదు.
ప్రమాదకరంగా ట్రాన్సఫార్మర్లు
మండలంలోని పలు గ్రామాల్లో పాఠశాలల వద్ద విద్యుత ట్రాన్సఫార్మర్లు కంచెలు లేకుండా ప్రమాదకరంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ట్రాన్సఫార్మర్ల వైర్లకు కంపచెట్లు, తీగలు అల్లుకోవడంతో అర్తు అవుతున్నాయి. గాలి వీచి, వర్షం కురిసినప్పుడు ట్రాన్సఫార్మర్ల వద్ద నిప్పురవ్వలు వస్తుండడంలో ఆయా గ్రామస్థులు భయాం దోళన చెందుతున్నారు. అధికా రులకు సమస్యను తెలిపినా పట్టించుకోవడం లేదనే ఆరోపణ లు ఉన్నాయి. కొన్ని గ్రామా ల్లో ని ఇళ్లలో అయితే నోటల్ వైర్‌కు విద్యుత సరఫరా అవుతోంది. దీంతో పలువురు ప్రమాదాల పడిన సంఘటనలు ఉన్నాయి. అలాగే పలు గ్రామాల్లో ట్రాన్స ఫార్మర్లు రోడ్డు పక్కనే ఉ న్నా యి. వాటికి కంచె వేయలేదు. ఇలా మండల కేంద్రంలోని పూలకుంట రోడ్డులో ఉన్న ట్రాన్సఫార్మర్‌ను గత యేడాది ఓ వ్యక్తి తగిలి, విద్యుదా ఘాతానికి అక్కడిక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పటికప్పు డు అధికారులు స్పందించి ఆ ఒక్క ట్రాన్సఫార్మర్‌కు మాత్రమే కంచె ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రాణం పోతే తప్ప అధికారులు స్పందించడం లేదని ప్రజలంటున్నారు. అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
కొన్నేళ్లుగా ఇనచార్జ్ పాలనే
మండలకేంద్రంలోని విద్యుత సబ్‌స్టేషనలో కొన్నేళ్లుగా రెగ్యులర్ విద్యుత అధికారులు లేరు. ఇనచార్జ్‌లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో విద్యుత సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగులేమో ఈ విషయంలో తామేమీ చేయలేమంటున్నారు. ప్రతి సమస్యను డీఈ దృష్టికి తీసుకెళతా మంటు న్నారు. ఇనచార్జ్ ఏఈలు ఎక్కడు ఉంటారో తెలియదు. ఫోన్లకు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. కొత్తగా బోరు వేసుకున్న రైతులు ట్రాన్స ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ఏఈ లాగినలోనే అవకాశం. ఏఈ అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగోలా అవస్థలు పడి దరఖాస్తు చేసుకున్న రైతులకు సకాలంలో ట్రాన్సఫార్మర్లు అందడం లేదు. దీంతో బోర్లు వేసుకుని సంవత్సరపైగా పడుతుండడంతో రైతులు పంటలు పండించుకోవడానికి వీలు లేకుండా పోతోంది. త్వరగా రెగ్యులర్ ఏఈని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
గాలుల వల్ల విద్యుత కోత- జనార్దన, లైనమ్యాన
ప్రస్తుతం వర్షాలతో పాటు గాలులు అధికంగా వస్తుండడంతో విద్యుత కోతలు ఉన్నాయి. మా దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. రాత్రిళ్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....