BUILDING: అసంపూర్తి నిర్మాణాలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:52 AM
పాలనను ప్రజలు అందుబా టులోకి తీసుకురావాల్సిన పలు ప్రభుత్వ భవన అసంపూర్తి నిర్మాణాలతో దిష్టి బొమ్మల్లా మండలంలో దర్శనమిస్తున్నాయి. నల్లమాడలోని జిల్లా పరి షత ఉన్నతపాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ. 1,11,90,000 నిధులు మంజూరయ్యాయి. దాదాపు నాగేళ్ల క్రితం ఈ భవన నిర్మాణం ప్రారంభించి, కొంతవరకు నిర్మించి వదిలేశారు.
- దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్న ప్రభుత్వ భవనాలు
- యేళ్లు గడుస్తున్నా, పట్టించుకోని పాలకులు
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ప్రజలు
నల్లమాడ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): పాలనను ప్రజలు అందుబా టులోకి తీసుకురావాల్సిన పలు ప్రభుత్వ భవన అసంపూర్తి నిర్మాణాలతో దిష్టి బొమ్మల్లా మండలంలో దర్శనమిస్తున్నాయి. నల్లమాడలోని జిల్లా పరి షత ఉన్నతపాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ. 1,11,90,000 నిధులు మంజూరయ్యాయి. దాదాపు నాగేళ్ల క్రితం ఈ భవన నిర్మాణం ప్రారంభించి, కొంతవరకు నిర్మించి వదిలేశారు. అసంపూర్తిగా ఉ న్న భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. కొంత మంది ఆకతాయిలు ఆ ఆభవనంలో నిత్యం బెట్టింగ్‌లు, ఆనలైన గేమ్‌లు ఆడుతున్నారు. మరి కొంతమంది గుట్కా నమలడం, పొగ తాగడం తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆ సమయం లో ఎవరైనా విద్యార్థినులు తరగతి గదుల నుంచి బయటకు వచ్చి ఆ భవనాల ముందు నుంచి వెళ్తున్నప్పుడు వారిని అసభ్యంగా మాట్లాడుతున్న సందర్భలు అనేకం ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒకటి రెండు మార్లు అటువంటి యువతను మందలిచినట్లు తెలుస్తోంది. అయి నా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఈ భవనం పూర్తి అయితే విద్యార్థినులకు సమస్య తప్పుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. అలాగే మండలకేంద్రంలోని 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిని, దాన్ని వంద పడకలకు మార్చేందుకు ప్రభుత్వం అదనపు భవన నిర్మాణాలను మూ డేళ్లక్రితమే ప్రారంభించింది. ఈ భవన నిర్మాణానికి రూ. 2. 65 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ భవనం నిర్మాణం ఇప్పటికీ పూర్తికాక పోవడంతో ఆసుపత్రిలో రోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు. అవస రమైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నా గదుల కొరతతో వైద్య సేవల కు అంతరాయం ఏర్పడుతోంది.
చికిత్సల కోసం రోగులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తే, అవసరమైనన్ని గదులు లేకపోవడంతో ప్రతిరోజు ఇళ్లకు వెళ్లి రా వాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే ఏమైనా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిందే పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చాల్సి వస్తోంది. నల్లమాడ ఆసుపత్రిలో అదనపు గదుల్లో భాగంగా పోస్టు మార్టం గదిని ఏర్పాటుచేశారు, అసంపూర్తి భవన్నాన్ని త్వరగా పూర్తి చేస్తే, రోగులకు చికిత్సలు పొందడానికి గదులతోపాటు, ఇక్కడే పోస్టుమార్టం చే యడానికి అవకాశముంటుందని ప్రజలు అంటున్నారు. ఈభవన నిర్మా ణాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే విలేజి క్లినిక్‌లు మండల వ్యాప్తంగా 12 మంజూరయ్యాయి. ఒక దానికి రూ.23. 50లక్షలు నిధులు మంజూరయ్యాయి. అయితే ఎర్రవంకపల్లి, వేళ్లమద్ది, పాతబత్తల పల్లి పంచాయతీల్లో విలేజి క్లినిక్‌లు పూర్తి అయి వైద్యాధికారు లకు భవనాలను అప్పగించారు. ఇంకా నల్లమాడ, ఎద్దులవాండ్లపల్లితండా, వంకర కుంట, బండవాండ్లపల్లిల్లో భవనాలు 80శాతం పూర్తికాగా మరో 20శాతం పూర్తి చేయాల్సి ఉంది. అరకొరగా పనులుండడంతో నిరుపయో గంగా దర్శన మిస్తున్నాయి. అంతేకాకుండా కురమాల, దొన్నికోట, గోపేపల్లి, చారుపల్లి పంచాయతీల్లో విలేజి క్లినిక్ భవనాలు పునాదులకే పరిమిత మయ్యాయి. ఇలా మండలంలో పలుచోట్ల గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి భవనాలను పాలకులు గుర్తించి, త్వరగా వాటి నిర్మాణాలను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు అంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....