PROGRAM: ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ’పై అవగాహన
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:09 AM
ధర్మవరం మండలంలోని దర్శినమల గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేష్, ఎంపీడీఓ సాయిమనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనం తరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
ధర్మవరం మండలంలోని దర్శినమల గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేష్, ఎంపీడీఓ సాయిమనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనం తరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఏలూరు వెంకటేష్, సచివాలయ సిబ్బంది, టీడీపీ నా యకులు జంగం నరసింహులు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే కొత్తచెరువు లో పంచాయతీ ఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచా యతీ కార్యాలయం నుంచి ర్యాలీగా నెహ్రూ కూడలి చేరుకున్నారు.
మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. నల్లచెరువులో ఎంపీడీఓ రఘునాథ్ గుప్త ఆధ్వర్యంలో ఉన్నతపాఠశాల విద్యార్థులతో కలిసి బస్టాండ్ కూలి వరకు ర్యాలీ నిర్వహించి, మానవహా రం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ జమానుల్లాఖాన, సర్పంచ పంచరత్న మ్మ, ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, కార్యదర్శి నరేష్ తదితరులు పా ల్గొన్నారు. తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌లో ఎంపీడీఓ రామానాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నల్లగుట్లపల్లి హైస్కూల్ నుంచి కొక్కంటిక్రాస్‌లోని కొక్కంటి రోడ్డు వరకు ర్యాలీ సాగింది. కొక్కంటి రోడ్డులో మానవహారం ఏర్పాటు చేశారు. డాక్టర్ ధర్మరాజు, టీడీపీ నా యకులు సోంపాల్యం నాగభూషణం, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మీదేవమ్మ, ఉపాధ్యాయులు రెడ్డెప్ప, కార్యదర్శి విజయేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి మండల పరిధిలోని గువ్వలగుట్టపల్లిలో ఐసీడీఎప్ సిబ్బంది మండలపరిషత పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. అంతకు మునుపు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుజాత ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు మస్తాన, కాంచన, భాగ్యమ్మ, కృష్ణవేణి, దీప, అంగనవాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....