ROAD: ముళ్ల పొదలతో ఇబ్బందులు
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:10 AM
మండలకేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే డబుల్ రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, గడ్డి పొద లను ఏపుగా పెరిగాయి. దీంతో వాహనదారులు చాల ఇబ్బందులు పడు తున్నారు. నల్లమాడ నుంచి నుంచి దొన్నకోట గ్రామం మీదుగా పులగం పల్లి వరకు, నల్లమాడ నుంచి రాగానిపల్లి, గోపేపల్లి మీదుగా కొండె పా ళెం వరకు ఈ పరిస్థితి కనిపిస్తోంది.
నల్లమాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే డబుల్ రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, గడ్డి పొద లను ఏపుగా పెరిగాయి. దీంతో వాహనదారులు చాల ఇబ్బందులు పడు తున్నారు. నల్లమాడ నుంచి నుంచి దొన్నకోట గ్రామం మీదుగా పులగం పల్లి వరకు, నల్లమాడ నుంచి రాగానిపల్లి, గోపేపల్లి మీదుగా కొండె పా ళెం వరకు ఈ పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా నల్లమాడ నుంచి కొం డకమర్ల, నల్లమాడ నుంచి మలకవేముల వరకు ఉన్న డబుల్ రోడ్లులో పరిస్థితి అలాగా ఉంది. దీంతో ద్విచక్రవాహనాలు, ఆటోలు ఆ రోడ్లపై వె ళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేగాకుండా గడ్డి ఏపుగా పె రగడంతో అందులో నుంచి సర్పాలు బయటకు వచ్చి రోడ్డుకు అడ్డంగా తిరుగుతున్నాయి. దీంతో వాహనచోదకులు వాహనాలు నడిపే సమయం లో భయపడి ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అఽధికారులు స్పందించి ఆ రోడ్లకు ఇరువైపులా ఉన్న గడ్డి పొదలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....