Share News

TRIBUTE: అంబేడ్కర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:20 AM

ప్రపంచ మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా శని వారం కదిరి పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

TRIBUTE: అంబేడ్కర్‌కు ఘన నివాళి
MLA paying homage at Ambedkar statue in Kadiri and others

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రపంచ మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా శని వారం కదిరి పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారథి, జన సేన నియోజకవర్గ ఇనచార్జ్‌ బైరప్రసాద్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన డైరెక్టర్‌ ఫర్వీనాబాను, పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు. అలాగే ధర్మవరం పట్టణంలోని కళా జ్యోతి సర్కిల్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కేశగాళ్ల శ్రీనివాసులు పూలమాల వేసి నివాళుల ర్పిం చారు. టీడీపీ నాయకులు మొండి శీన, ఆదినారాయణ, నరసింహ, న వీన, ఇజ్రాయిల్‌, శివ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా వైసీపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవరకొండ రమేశ, రాష్ట్ర కార్యదర్శి చౌడప్ప తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.


బుక్కపట్నంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ స్థానిక నాయకులు బుక్కపట్నంలోని పోలీస్‌స్టేషన వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మాజీ ఎంపీపీ బాలు, బు లగుండ్ల శ్రీనివాసులు, రాష్ట్ర కురుబ కార్పొరేషన డైరెక్టర్‌ గొర్ల కృష్ణ కేసాని ఆదినారాయణ, కరణం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

అలాగే కదిరిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మాల మహానాడు నాయకులు, అంబేడ్కర్‌ సేవా సమితి నాయకులు నివాళులర్పించారు. ఆర్టీసీ డిపో ఆవరణంలో ఏపీపీటీడీ ఆద్వర్యంలో డిపో మేనేజర్‌ మైనుద్దీన, ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌ పెద్దన్న తదితరులు అంబేద్కర్‌ చిత్రపటా నికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిశంగా నంబులపూలకుంటలోని నాగులకట్ట సమీపం లో, తహసీల్దార్‌ కార్యాల యంలో అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళ్లు అర్పించారు. అలాగే ము దిగుబ్బ, అమడగూరు, గాండ్లపెంట, నల్లచెరువు, నల్లమాడ, ఓబుళ దేవర చెరువు, తనకల్లు తదితర మండలకేంద్రాల్లో, తనకల్లు మండలంలోని వంకపల్లి గ్రామంలో అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మార్పీఎస్‌, దళి త సంఘాల నాయకులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘల సభ్యులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 07 , 2025 | 12:20 AM