ROAD: రోడ్డును కప్పేసిన కంపచెట్లు
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:55 PM
మండలంలోని గొట్లూరు నుంచి బడన్నపల్లి కి వెళ్లే రహదారి కంపచెట్లుతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. పూర్తిగా కంపచెట్లు రోడ్డు మధ్యలోకి పెరిగిపోవడంతో ద్విచక్రవాహనదారులకు కంపలు గీసుకుని గాయాలవుతున్నాయని తెలుపుతున్నారు.
ధర్మవరం రూరల్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని గొట్లూరు నుంచి బడన్నపల్లి కి వెళ్లే రహదారి కంపచెట్లుతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. పూర్తిగా కంపచెట్లు రోడ్డు మధ్యలోకి పెరిగిపోవడంతో ద్విచక్రవాహనదారులకు కంపలు గీసుకుని గాయాలవుతున్నాయని తెలుపుతున్నారు. ఆ దారిలో ప్రయాణం అంటేనే ఆందోళన కలిగిస్తోందని వాపోతున్నారు. అదేవిధంగా గొట్లూరుు రైతులు తమ పొలాలకుగానీ, చెరువు వద్దకుగానీ వెళ్లాలంటే ఇదే రహదారి. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామ రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న కంపచెట్లు తొలగించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆ రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....