TAMOTO: టమోటాకు తెగుళ్ల బెడద
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:21 AM
రైతులు రూ.లక్షలు ఖర్చుపెట్టి సాగుచేసిన టమాటా పంట ఎడతెరిపి లేని వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. ఆకులు, కా యలపై నల్లమచ్చలు, తెగుళ్లు వ్యాపించడంతో తీవ్రంగా నష్టపో తున్నారు. జిల్లాలో 1,150 ఎకరాల్లో టమోటా సాగైనట్లు అధికారు ల లెక్కలు చెబుతుం డగా, అనధికారికంగా మరో 500 ఎకరాల్లో సాగైంది. మే నెలాఖరు, జూనలో సాగుచేసిన పంటలను ప్రస్తుతం కోత కోస్తుండగా, జూలైలో సాగైన పంట లు పూత దశలో ఉన్నాయి.
వర్షాలకు దెబ్బతిన్న పంట
ముదిగుబ్బ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రైతులు రూ.లక్షలు ఖర్చుపెట్టి సాగుచేసిన టమాటా పంట ఎడతెరిపి లేని వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. ఆకులు, కా యలపై నల్లమచ్చలు, తెగుళ్లు వ్యాపించడంతో తీవ్రంగా నష్టపో తున్నారు. జిల్లాలో 1,150 ఎకరాల్లో టమోటా సాగైనట్లు అధికారు ల లెక్కలు చెబుతుం డగా, అనధికారికంగా మరో 500 ఎకరాల్లో సాగైంది. మే నెలాఖరు, జూనలో సాగుచేసిన పంటలను ప్రస్తుతం కోత కోస్తుండగా, జూలైలో సాగైన పంట లు పూత దశలో ఉన్నాయి. వర్ష ప్రభావంతో కాయలపై నల్లమచ్చలు అధికంగా రావడంతో రైతులు మార్కెట్‌కు తరలించ లేకపోతున్నారు. అలాగే వదిలేస్తే తోట మొత్తం తెగుళ్లు వ్యా పిస్తాయని కూలీలతో కాయ లు తొలగిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఆగస్టు మొదటి వారం నుం చి టమాటా ధరలు కాస్త పెరిగాయి. 30 కిలోల బాక్సు ధర రూ. 800 నుంచి రూ. 1000 వరకు పలుకుతోంది. ముదిగుబ్బ, కదిరి ప్రాంతాల నుం చి అధికంగా మదనపల్లి టమోటా మార్కెట్‌కు తరలించి విక్రయిస్తారు. తెగుళ్లతో కాయ నాణ్యత తగ ్గడంతో మార్కెట్‌లో తక్కు వ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. తెగుళ్ల బెడదతో దిగుబడి తగ్గుతోందని, రానుపోను రవాణా ఖర్చులకు సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు.
వాతావరణంలో అధిక తేమ వల్ల తెగుళ్లు - అమరేశ్వరి, ఉద్యానవన శాఖ అధికారి
వాతావరణంలో అధిక తేమతో ఆకుమచ్చ తెగులు వ్యాపిస్తోంది. లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజీబ్ లేదా 3 గ్రాముల క్లోరో తలోనిల్ కలిపి పిచికారి చేయాలి. బ్యాక్టీరియా ఆశించకుండా 10 లీటర్ల నీటికి 5 గ్రాముల కాపర్ హైడ్రాక్సైడ్ లేదా 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, గ్రాము సె్ట్రప్టో సైక్లిన మందును కలిపి పిచికారి చేయాలి. ఈ మందులను పిచికారి చేసే సమయంలో జిగురు కలిపితే సమర్థవంతంగా తెగుళ్లను నివారించవచ్చు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....