TAMOTO : టమోటా వర్షార్పణం
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:23 AM
మండలంలోని మార్పురివాం డ్లపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ భాగంలో ఉన్న వంకలు, వాగులు, కుంటలు, పొంగిపోర్లాయి. దీంతో ఎగువ కుంటవద్ద రైతు రవి ఎకరం పొలంలో సాగుచేసిన టమోటా పంట మొత్తం నీటిలో కొట్టుకు పోయింది. దీంతో రూ.లక్ష నష్టం జరిగినట్లు బాధిత రైతు రవి తెలిపారు.
తనకల్లు, సెప్టెంబరు24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మార్పురివాం డ్లపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ భాగంలో ఉన్న వంకలు, వాగులు, కుంటలు, పొంగిపోర్లాయి. దీంతో ఎగువ కుంటవద్ద రైతు రవి ఎకరం పొలంలో సాగుచేసిన టమోటా పంట మొత్తం నీటిలో కొట్టుకు పోయింది. దీంతో రూ.లక్ష నష్టం జరిగినట్లు బాధిత రైతు రవి తెలిపారు. ఆరుగాలం కష్టపడి పంట సాగుచేశానని, పంట బాగా ఉండడంతో జత కట్టెలు కట్టడానికి రూ. 3 ఒప్పందంతో 2,200 కట్టెలు నాట్టించానని తెలిపారు. ఒకేరోజు రాత్రి వర్షం ఎక్కువగా కురవడంతో వంకలు, వాగులు దాటి పొలాల్లోకి నీరుపారిందన్నారు. ఉదయం పొలం వద్దకు వెళ్లి చూస్తే సాగుచేసిన టమోటా మొత్తం నీటిలో కొట్టుకుపోయిందని ఆవేదన చెందా రు. కేవలం అక్కడక్కడ కొన్ని కట్టెలు మిగిలాయన్నారు. పూత దశలో ఉన్న పంట ఆనవాళ్లు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం, అధికారులు పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనావేసి, ఆదుకోవాలని రైతు రవి కోరారు.