Share News

MLA: వెలుగులు నింపాలని..

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:23 AM

లోఓల్టేజీ సమస్యను అధిగ మించేందుకు మండలంలోని వెంగళమ్మచెరువు గ్రామంలో రూ.4 కోట్లతో నిర్మించ తలపెట్టిన సబ్‌ స్టేషనకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సోమ వారం భూమిపూజ చేశారు.

MLA: వెలుగులు నింపాలని..
Bhumi is worshiping MLA, former minister, electricity officials

విద్యుత సబ్‌స్టేషనకు భూమి పూజ

పుట్టపర్తిరూరల్‌, అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): లోఓల్టేజీ సమస్యను అధిగ మించేందుకు మండలంలోని వెంగళమ్మచెరువు గ్రామంలో రూ.4 కోట్లతో నిర్మించ తలపెట్టిన సబ్‌ స్టేషనకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సోమ వారం భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నియోజకవర్గంలో లోఓల్టేజీ సమస్యలను అధిగమించేందుకు సబ్‌స్టేషన ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యుతశాఖ ఎస్‌ఈ సంపతకుమార్‌, ఈఈ శివరాం, డీఈ (కనస్ట్రక్ష న్స) శ్రీధర్‌, నేతలు విజయ్‌కుమార్‌, సామకోటి ఆదినారాయణ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 07 , 2025 | 12:23 AM