Share News

TEACHERS: టెట్‌ నుంచి మినహాయించాలి : డీటీఎఫ్‌

ABN , Publish Date - Nov 13 , 2025 | 11:48 PM

ఇనసర్వీస్‌ ఉపా ధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని కోరుతూ ప్రదానమంత్రి నరేంద్రమోదీకి లేఖ పంపినట్లు డెమోట్రిక్‌ టీచర్స్‌ ఫెడరేషన (డీటీ ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు కట్టుబడి గౌస్‌ లాజం తెలిపారు. ఆయన గురు వారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యా యులకు టెట్‌లో మినహాయింపు ఇచ్చే విధంగా చూడాలని ప్రధానమం త్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదానకు లేఖ రాశామన్నారు.

TEACHERS:  టెట్‌ నుంచి మినహాయించాలి : డీటీఎఫ్‌
Teachers sending letter to Prime Minister through post card

ఇనసర్వీస్‌ ఉపాధ్యాయులను

టెట్‌ నుంచి మినహాయించాలి : డీటీఎఫ్‌

ఓబుళదేవరచెరువు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇనసర్వీస్‌ ఉపా ధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని కోరుతూ ప్రదానమంత్రి నరేంద్రమోదీకి లేఖ పంపినట్లు డెమోట్రిక్‌ టీచర్స్‌ ఫెడరేషన (డీటీ ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు కట్టుబడి గౌస్‌ లాజం తెలిపారు. ఆయన గురు వారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యా యులకు టెట్‌లో మినహాయింపు ఇచ్చే విధంగా చూడాలని ప్రధానమం త్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదానకు లేఖ రాశామన్నారు. టెట్‌ నుంచి మినహాయింపు చర్యలు చేపట్టాలని, 2010 సంవత్సరానికి మునుపు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్‌ పాసై ఉండాలనే సుప్రీం కోర్టు తీర్పును సవరిస్తూ కేంద్రం చట్టం తీసుకురాలని కోరామన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమశేఖర్‌నాయక్‌, వెంకటాచలమయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 13 , 2025 | 11:48 PM