OFFICES: ఒకే గదిలో మూడు సచివాలయాలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:29 PM
మండలకేంద్రంలో మూడు సచివాలయాలున్నాయి. రెండేళ్ల క్రితం ఆ మూడు సచివాలయాల సిబ్బంది వారివారి భవనాల్లో విదులు నిర్వహిం చేవారు. యేడాది క్రితం మండలకేంద్రంలో నూతనంగా సచివాలయ భవనం నిర్మించారు. ఈ భవనంలోని ఒకే గదిలో మూడు సచివాలయాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
తమ సిబ్బంది ఎవరో తెలుసుకోలేక
ఇబ్బందులు పడుతున్న వివిధ గ్రామాల ప్రజలు
నల్లమాడ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి) : మండలకేంద్రంలో మూడు సచివాలయాలున్నాయి. రెండేళ్ల క్రితం ఆ మూడు సచివాలయాల సిబ్బంది వారివారి భవనాల్లో విదులు నిర్వహిం చేవారు. యేడాది క్రితం మండలకేంద్రంలో నూతనంగా సచివాలయ భవనం నిర్మించారు. ఈ భవనంలోని ఒకే గదిలో మూడు సచివాలయాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పై వచ్చిన ప్రజలు తమకు సంబంధించిన సచివాలయం సిబ్బంది ఎవరో అర్థం కాక సతమతమవుతున్నారు. పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు ఆ గదిలోకి వెళ్లి, తమ ఊరు చెబితే అదిగో వారే మీ సచివాలయ సిబ్బంది అని చెప్పాల్సిన దుస్థితి నెలకొంది. అంతే గాకుండా మూడు సచివాలయాలకు చెందిన 20 మంది దాకా సిబ్బంది ఒకే గదిలో విధులు నిర్వహించడం ఇబ్బందికరంగానే ఉంది.
అయితే అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరో రెండు సచివా లయాల నిర్మాణం 90శాతం పూర్తి అయింది. మరో పదిశాతం పనులు పూర్తి చేసి వాటిని ప్రారంభిస్తే... ఏ సిబ్బంది తమ తమ సచివాలయాల్లోనే విధులు నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. దీంతో సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు తమ సచివాలయానికి నేరుగా వెళ్లి వారి పరిష్కరించుకోవడానికి అవకాశముంటుందని ప్రజ లు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాఽధి కారులు స్పందించి, పదిశాతం పనులున్న సచివాలయాల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం- ఎస్ హాజీవలి, డిప్యూటీ ఎంపీడీఓ
మండలకేంద్రంలోని ఒకే గదిలో మూడు సచివాలయాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని జిల్లా అధికా రుల దృష్టికి తీసుకెళ్తాం. మిగిలిన రెండు సచివాలయాల భవనాల నిర్మా ణం పనులు జరుగుతున్నాయి. వాటి నిర్మాణం త్వరగా పూర్తయ్యేం దుకు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....