TDP: పరిటాల శ్రీరామ్ దృష్టికి పలు సమస్యలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:26 AM
మండలపరిధిలోని బిల్వంప ల్లిలో సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామానికి చెంది న టీడీపీ నాయకుడు బాల ఓబిలేసు పుష్పగుచ్ఛం అందజేసి, పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ప్ర జలు పలు సమస్యలను ఆయన దృష్టికి తె చ్చారు. గత ప్రభుత్వంలో అన్యాయంగా త మ పింఛన్లు తొలగించారని, వాటిని పున రుద్దరించాలని పలువురు కోరారు.
ధర్మవరం రూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని బిల్వంప ల్లిలో సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామానికి చెంది న టీడీపీ నాయకుడు బాల ఓబిలేసు పుష్పగుచ్ఛం అందజేసి, పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ప్ర జలు పలు సమస్యలను ఆయన దృష్టికి తె చ్చారు. గత ప్రభుత్వంలో అన్యాయంగా త మ పింఛన్లు తొలగించారని, వాటిని పున రుద్దరించాలని పలువురు కోరారు. అదేవి ధంగా గ్రామంలో రచ్చకట్ట నిర్మా ణానికి కొందరు అడ్డుపడుతున్నారని తెలిపారు. గ్రామంలోని నీరంతా రోడ్డుపై నిలుస్తోందని, దీంతో రోడ్డుపై వెళ్లేందుకు వీలులేకుండా పోతోందని ఆయనకు విన్నవించారు. ఆయన స్పందిస్తూ ఈ నీరు పక్కనున్న బావిలోకి వెళ్లేలా చూడాలని అక్కడున్న అధికారులకు సూచించారు. వీటితో పాటు పలు సమస్యలను గ్రామస్థు లు పరిటాల శ్రీరామ్‌కు వి న్నవించారు. వీటిపై ఆయ న స్పందిస్తూ అధికారులతో మాట్లాడి గ్రామంలో నెలకొ న్న సమస్యలను పరిష్కా రిస్తామని హామీ ఇ చ్చా రు. కూటమి ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షే మ పథకాలు అందుతున్నా యా లేదా అని ప్రజలతో ఆరాతీశారు. ప్రజల సంక్షే మమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు ఆహార్నిశలు శ్రమిస్తున్నార న్నారు. ఎన్నికల మునుపు ఇచ్చిన ప్రతిహామీని నేరవేరుస్తారన్నారు. ఆయన వెంట క్లస్టర్ ఇనచార్జ్ మహేష్‌చౌదరి, గొట్లూరు సింగల్ విండో సొసైటీ అధ్యక్షుడు మేకల రామాంజినేయులు, విజయసారథి, ఏలుకుం ట్ల రమణ, బిల్వంపల్లి బాబు, నరసింహులు, రవి, ధనుష్, నేలకోట రామ్మో హనరెడ్డి, ముచ్చురామిక్రిష్ణ, పోతుకుంటపవన తదితరులు పాల్గొన్నారు.