FORMER MINISTER: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:44 PM
రైతుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమా న్ని ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని డబురువారిపల్లిలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీ కోసం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా జీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
‘రైతన్నా మీ కోసం’లో మాజీ మంత్రి పల్లె
ఓబుళదేవరచెరువు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రైతుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమా న్ని ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని డబురువారిపల్లిలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీ కోసం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా జీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన ద్వారా ఏటా రూ. 20వేలు మం జూరు చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవ త్సరం రెండు విడతలుగా ఒక్కొక్క రైతుకు రూ. 14వేలు చొప్పున ఖాతాలో జమచేశారన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను కృష్ణా జలాలతో నింపి ఆ ప్రాంతాలను సస్య శ్యామలం చేస్తామన్నారు. రైతులు సేంద్రీయ పద్ధతులలో వ్యవసాయాన్ని అవరుచుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అఽధికారి ఇలియాజ్ అహ్మద్, టీడీపీ మండల కన్వీనర్ జయచంద్ర, నాయకులు అంజినప్ప, శివారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, జాకీర్ అహ్మద్, మాజీ సర్పంచ పొగాకు షఫీ, గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్ర, గంగిరెడ్డి, మార్కెట్‌యార్డ్ డైరెక్టర్‌లు ప్రవీణీ గోపినాథ్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, వీఏఏ అనీల్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....