MLA: రైతుల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:59 PM
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. ఆయన ఆదివారం మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుం చి పుంగనూరు బ్రాంచ కెనాల్‌కు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారఽథి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్ భైరవప్రసాద్‌తో కలిసి నీటిని విడుదల చేశారు.
ఎమ్మెల్యే కందికుంట - పీబీసీకి నీటి విడుదల
కదిరి అర్బన, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. ఆయన ఆదివారం మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుం చి పుంగనూరు బ్రాంచ కెనాల్‌కు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారఽథి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్ భైరవప్రసాద్‌తో కలిసి నీటిని విడుదల చేశారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు పడ్డారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడుతూనే పుంగనూరు బ్రాంచ కెనా ల్‌కు నీటిని తరలిస్తున్నామన్నారు. సాగునీటి ఇబ్బందులు దృష్టిలో పెట్టు కుని, మండలంలోని పట్నం, కాళ సముద్రం చెరువులకు నీరందించా మన్నారు.
రాయలసీమ వాసి అయిన జగన తన పాలనలో హంద్రీనీ వా సుజల స్రవంతి కాలువకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారో ప్రజలకు తెలపాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం రూ. 200కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేపట్టి సాగునీరు వృథాకాకుండా చూస్తోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కదిరి పట్టణానికి తాగునీరు అందించాలని జీఓ తేస్తే, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి అమలు చేయలేకపోయిందనారు. తాజాగా రూ. 23 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాన్నారు. శాశ్వత పనులకు ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన దిల్షాదున్నీషా, కూటమి నాయకులు ఫర్వీనబాను, అనసూయ, చెన్నకేశవులు, బాహు ద్దీన, గంగులప్ప, హరి, రామచంద్ర, చిన్నానాయుడు, రామమోహన, రమేష్, కుప్పాల ప్రసాద్, మనోహర్, జయచంద్ర, ప్రేమలత, యూనూస్, సుధాకర్, ఈశ్వర్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....