GOD: భక్తులతో కిటకిటాడిన ఖాద్రీశుడి ఆలయం
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:04 AM
పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటాడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయం భక్తులతో నిండిపోయింది.
కదిరి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటాడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయం భక్తులతో నిండిపోయింది. సెలవులు ముగియ డంతో భక్తులు తమ పని ప్రదేశాలకు వెళ్లే క్రమంలో దైవ దర్శనం చేసుకునేందుకు అధికంగా వచ్చారు. ఆలయ ఆధికారులు అన్నదా నంతో పాటు ఇతర వసతులు కల్పించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....