GOD: ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:56 PM
మండలపరిధిలోని నిలువురాతి పల్లిలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠను బుధవా రం ఘనంగా నిర్వ హించారు. గ్రామస్థు లంతా కలిసి రూ. కోటి వ్యయంతో గ్రా మంలో నూతనంగా రామాలయం నిర్మించారు. ప్రధాన పౌరోహి తులు మునికోటి కోదండపాణి శర్మ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా 15 మంది వేద పండితులు గణపతి పూజ, కలశస్థాపన, హోమా లు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అమడగూరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని నిలువురాతి పల్లిలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠను బుధవా రం ఘనంగా నిర్వ హించారు. గ్రామస్థు లంతా కలిసి రూ. కోటి వ్యయంతో గ్రా మంలో నూతనంగా రామాలయం నిర్మించారు. ప్రధాన పౌరోహి తులు మునికోటి కోదండపాణి శర్మ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా 15 మంది వేద పండితులు గణపతి పూజ, కలశస్థాపన, హోమా లు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజప్రతిష్ఠతో పాటు శివుడు, నంది, వినాయకుడు, నవగ్రహాలను ప్రతిష్ఠించారు. బుధవారం సీతారామలక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ చేసి, సా యంత్రం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. గురువారం శ్రీరాముల పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు పండితులు తెలిపారు. కడపజిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని కమ్మవారిపల్లికి చెంది న లక్ష్మీనాయుడు, గుర్రమ్మ దంపతులు 26.5 అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభం విరతణ చేశారు. గ్రామంలో ఐదురోజుల పాటు రామాలయం వద్ద కోలాటం, చెక్కభజన, కోదండరామభజన లాం టి కార్యక్రమాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....