MLA: వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:11 PM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అ ప్పుల మయమైన రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ఆక్సిజనలా మారి, పరిస్థి తులను గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో కొత్తచెరువు ప్రాథ మిక సహకార సొసైటీ అధ్యక్షుడిగా అప్పకొండప్పగారి హరిప్రసాద్ ప్రమా ణ స్వీకారోత్సవాన్ని మంగళవారం సొసైటీ సీఈఓలు నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
- అప్పుల మయమైన రాష్ట్రానికి ఆక్సిజనలా సీఎం
- సహకారం సంఘం అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
కొత్తచెరువు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అ ప్పుల మయమైన రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ఆక్సిజనలా మారి, పరిస్థి తులను గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో కొత్తచెరువు ప్రాథ మిక సహకార సొసైటీ అధ్యక్షుడిగా అప్పకొండప్పగారి హరిప్రసాద్ ప్రమా ణ స్వీకారోత్సవాన్ని మంగళవారం సొసైటీ సీఈఓలు నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మాజీ సీఎం జగన, ఆయన కో టరీ దోచుకుని దాచుకోవడంతో రాష్ట్రం అప్పులమయం అయిందన్నారు. రై తులు, ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. కూటమి అధికారంలోకి వ చ్చిన 15నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వంద శాతం సూపర్‌హిట్ చేసిందన్నారు. బుధవారం అనంతపురంలో జరిగే బహిరంగ సభకు పెద్దఎత్తున పార్టీశ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె కోరారు. సీఎం చంద్రబాబు కూటమి నాయకులకు సమ ప్రాధాన్యమి స్తూ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులను ఇస్తున్నారన్నారు. ఇందుకు నిదర్శనం విశ్రాంత ఉపాధ్యాయుడు హరిప్రసాద్ అన్నారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు హరిప్రసాద్, డైరెక్టర్లు లక్ష్మీదేవి, అహమ్మద్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ... త నపై నమ్మకంతో ఈ పదవి అప్పచెప్పిన మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకు అందు బాటులో ఉండి తోడ్పాటు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు సాలక్కగారి శ్రీనివాసులు, కాంట్రాక్టర్ లక్ష్మీనారాయ ణ, శివప్రసాద్, మండల, టౌన కన్వీనర్లు రామకృష్ణ, శీన, మాజీ ఎంపీపీ వాణి, పుట్టపర్తి మార్కెట్‌యార్డ్ చైర్మన పూలశివ, కురుబ కార్పొరేషన డైరెక్టర్ శ్రీనివాసులు, సాగునీటి సంఘం అధ్యక్షువడు పీవీ నవీనకుమార్, బీజేపీ నాయకులు శేషాద్రినాయుడు, దివ్యతేజ, మాజీ సర్పంచలు హరినాథ్‌చౌదరి, మాణిక్యంబాబా, విశ్రాంత ఉపాధ్యాయులు రామకృష్ణప్ప, వెంగన్న, శివయ్య, నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....