JVV: ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:49 PM
ప్రజల్లో శాస్ర్తీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెరగాలని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు. స్థానిక ఎనజీఓహోంలో ఆదివారం జేవీవీ జిల్లా అధ్యక్షుడు మహేంద్రరెడ్డి అధ్యక్షతన జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గేయానంద్ మాట్లాడుతూ... ప్రజల్లో శాస్ర్తీయ దృక్ప థం, ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ ఉంటాయన్నారు.
ధర్మవరం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ప్రజల్లో శాస్ర్తీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెరగాలని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు. స్థానిక ఎనజీఓహోంలో ఆదివారం జేవీవీ జిల్లా అధ్యక్షుడు మహేంద్రరెడ్డి అధ్యక్షతన జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గేయానంద్ మాట్లాడుతూ... ప్రజల్లో శాస్ర్తీయ దృక్ప థం, ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ ఉంటాయన్నారు. సమాజంలో మంచి వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతూ కొత్త మూఢనమ్మకాలు ముం దుకు వస్తున్నాయన్నారు. పర్యావరణం పెద్దసమస్యగా మారిందన్నారు. విద్యావ్యవస్థలో సృజనాత్మకతకు స్థానం లేకపోగా ర్యాంకులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. పిల్లలను పరిశోధనల వైపు ప్రోత్సహించడం సన్నదిగిల్లిందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు కార్పొ రేట్ల చేతుల్లో చిక్కుకుని వాళ్లకు లాభాలు తెచ్చిపెట్టే వనరులుగా మారిపోయాయన్నారు. ఈ మార్పులను అవగాహన చేసుకుని జేవీవీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సభలో జేవీవీ రాష్ట్రకోశాధికారి రాజశేఖర్‌రాహుల్, డాక్టర్‌లు బషీర్, ఈటీ రామ్మూర్తి, జేవీవీ జిల్లా ప్రధానకార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, కోశాధికారి చంద్రశేఖర్ రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సానే రవీంద్రారెడ్డి, నాయకులు నర్సారెడ్డి, చైతన్య గంగిరెడ్డి, గౌస్‌లాజం, సురేశ, సంజీవప్ప, లక్ష్మీనారాయణ, షర్ఫుద్దీన, మహేశ, లోకేశ, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....