JSP: సభాప్రాంగణం వద్దకు దూసుకొచ్చిన జనసైనికులు
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:25 AM
డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఉపన్యాసం ప్రారంభం కాగానే జనసేన పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఒక్కసారిగా బారికేడ్లను దాటుకోని సభాప్రాంగణం వద్దకు దూసుకొచ్చారు. డిప్యూటీ సీఎం ఉపన్యాసం ప్రారంభం కాగానే ఒక్కసారిగా జనసైనికులు జెండాలతో వీవీఐపీ, వీఐపీ, పాత్రికేయులకు ఏర్పాటుచేసిన గ్యాలరీలోకి వేగంగా రా వడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు.
ధర్మవరం రూరల్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఉపన్యాసం ప్రారంభం కాగానే జనసేన పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఒక్కసారిగా బారికేడ్లను దాటుకోని సభాప్రాంగణం వద్దకు దూసుకొచ్చారు. డిప్యూటీ సీఎం ఉపన్యాసం ప్రారంభం కాగానే ఒక్కసారిగా జనసైనికులు జెండాలతో వీవీఐపీ, వీఐపీ, పాత్రికేయులకు ఏర్పాటుచేసిన గ్యాలరీలోకి వేగంగా రా వడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు అలర్ట్ అయి అదుపుచేశారు. పవనకళ్యాణ్ ప్రసంగం సాగినంత సేపు వారంతా జై పవనకళ్యాణ్, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఓ అభిమాని ముందు భాగంలో లైట్లకు అమర్చిన నిచ్చెన ఎక్కాడు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కిందకు దిగాలని ఎంత వారించినా వినలేదు. సీఎం చంద్రబాబు ప్రసంగంలో భాగంగా సూపర్‌సిక్స్ పథకాల పేర్లు చెబుతూ ఉంటే సూపర్‌హిట్ అంటూ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అలాగే కార్యక్రమానికి వచ్చిన తెలుగుమహిళలు స్త్రీశక్తి పథకంతో ఎంతోమేలు చేసిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ టీడీపీ పాటలకు నృత్యాలు చేశారు.