Share News

Health : పెద్దాస్పత్రిని విస్తరించాల్సిందే..!

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:24 AM

జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిని విస్తరించాల్సిందేననే అభిప్రాయానికి వైద్య బృందం వచ్చింది. అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన రహార్‌ నేతృత్వంలో కలెక్టర్‌ ఏర్పాటు చేసిన వైద్య బృందం గురువారం ఆస్పత్రిలో పలు విభాగాలను పరిశీలించింది. అక్కడి రోగులతో సమస్యలపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో రోగులకు మెరుగైన...

Health : పెద్దాస్పత్రిని విస్తరించాల్సిందే..!
Assistant Collector, Doctors Jagannath and Atmaram inspecting the female surgical ward

వైద్య బృందం

ఆస్పత్రిలో పలు విభాగాల పరిశీలన

అనంతపురం వైద్యం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిని విస్తరించాల్సిందేననే అభిప్రాయానికి వైద్య బృందం వచ్చింది. అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన రహార్‌ నేతృత్వంలో కలెక్టర్‌ ఏర్పాటు చేసిన వైద్య బృందం గురువారం ఆస్పత్రిలో పలు విభాగాలను పరిశీలించింది. అక్కడి రోగులతో సమస్యలపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే ఆస్పత్రిని విస్తరించాల్సిందేననే అభిప్రాయానికి వచ్చింది. ఆమేరకు నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. రెండు దశాబ్దాల కిందటే బోధనాస్పత్రిగా మారిన పెద్దాస్పత్రిలో నేటికీ మంచాలు(బెడ్‌) పెంచలేదు. వార్డులు, ఓపీలు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ కేంద్రాలు పాత భవనాల్లోనే కొన సాగుతున్నాయి. 2014-19లో మాత్రం చిన్నపిల్లల వార్డు,


అత్యవసర విభాగాన్ని విస్తరించారు. డాక్టర్లు, సిబ్బందిని మాత్రం తగిన సంఖ్యలో నియమించలేదు. రోగుల తాకిడి మాత్రం రెండింతలు పెరిగింది. ఈ నేపథ్యంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల లేమి తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు ప్రచురిత మయ్యాయి. ఆస్పత్రిని బాగుచేయాలని ఇటీవల సూపరింటెండెంట్‌గా బాఽధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ ఆత్మారామ్‌ గట్టిగా పట్టుపట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన ఆస్పత్రిలో విషయాలు తెలసుకోవడానికి అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన రహార్‌ నేతృత్వంలో రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌, దివ్యశ్రీ నర్సింగ్‌ హోమ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రామ్‌మోహన, స్నేహలత హాస్పిటల్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ అరుణతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వారుగురువారం ఆసుపత్రిలో విభాగాల వారిగా తనిఖీ చేసి, వివరాలు నమోదు చేసుకున్నారు.


(మరిన్ని అనంతపురం వార్తల కోసం..)

Updated Date - Aug 08 , 2025 | 12:25 AM