ROADS: ప్రయాణం నరకం
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:55 PM
ఆ రోడ్లలో ప్రయాణించా లంటే ఒళ్లు గుల్ల అవుతోంది. అసలే వర్షాకాలం, ఏ గుంత ఎంత లోతు ఉంటుందో తెలియని పరిస్థితి. రోడ్లు వర్షపు నీటితో నిండిపోవడంతో ఎక్కడ ఎంతలోతు గుంతలున్నాయో తెలియక ద్విచక్రవాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అదుపు తప్పి గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఎగుడుదిగుడు రోడ్లలో ప్రయాణికుల ఇక్కట్లు
వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోని తారు రోడ్లు
ప్రస్తుతం మరింత అధ్వానం
ఓబుళదేవరచెరువు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఆ రోడ్లలో ప్రయాణించా లంటే ఒళ్లు గుల్ల అవుతోంది. అసలే వర్షాకాలం, ఏ గుంత ఎంత లోతు ఉంటుందో తెలియని పరిస్థితి. రోడ్లు వర్షపు నీటితో నిండిపోవడంతో ఎక్కడ ఎంతలోతు గుంతలున్నాయో తెలియక ద్విచక్రవాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అదుపు తప్పి గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. దెబ్బతిన్న రోడ్లను గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బాగుచేయలేదు. దీంతో ఉన్న అతు కులు గతుకుల రోడ్లులోనే ఆయా గ్రామాల ప్రజలు అతి కష్టం మీద ప్రయాణం సాగించారు. ప్రస్తుతం ఆ రోడ్లు మరింత దెబ్బతినడంతో ఆయా ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. మండలపరిధిలో అల్లాపల్లి పంచాయతీలోని ఉగ్గిరెడ్డిపల్లి రోడ్డు, వెంకటాపురం పంచాయతీలోని నారప్పగారిపల్లి క్రాస్ నుంచి కరకమాను తోపు వరకు రోడ్డులో ఈ పరిస్థితి నెలకొంది.
వైసీపీ పాలనలో నోచుకోని అభివృద్ధి
గడిచిన ఐదేళ్లు వైసీపీ పాలనలో గ్రామీణ రహదారులు అభివృద్ధికి నోచుకోలేదు. ఇందుకు నిదర్శనం ఉగ్గిరెడ్డిపల్లి, వెంకటాపురం రోడ్లు. ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిదులు దృష్టికి గతంలో తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో గత్యంతరం లేక ఉన్న రోడ్డునే వినియోగించుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయం లో పాద చారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రధానంగా రోడ్లు గుంతలమయం కావడంతో
ద్విచక్రవాహనదారులకు, ఆటోల్లో ప్రయా ణించేవారికి వెన్ను నొప్పులు వస్తున్నా యని ప్రజలు వాపోతు న్నారు. ద్విచక్రవాహన దారు లు ఆదమరచి గుంతల్లో ప డి రక్త గాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. గత వైసీపీ పాలనలో దెబ్బతిన్న, గుంతల మయం అయిన రోడ్లుతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే దృష్టిసారించి, రోడ్లు వేయాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో తప్పని తిప్పలు
అత్యవసర పరిస్థితుల్లో ఉగ్గిరెడ్డిపల్లి, వెంకటాపురం పంచాయతీల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. అత్యవసర సమయంలో 108 వాహనం అతి కష్టం మీద గ్రామంలోకి వచ్చినా, సమయం ఎక్కువ పడుతోంది. ఆ లోపు జరగరానిది జరిగే అవకాశాలున్నాయి. ఉగ్గిరెడ్డిపల్లిలో దాదాపు రెండు కిలోమీటర్లు, నారప్పగారిపల్లి క్రాస్ నుంచి కరికమాను తోపు వరకు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా దెబ్బతినింది. దీంతో అరగంట పటే ్ట ప్రయాణం రెట్టింపు సమయం పడుతోంది.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....