GOD: ఘనంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:49 PM
మండల కేం ద్రంలోని చిన్నమిట్ట వద్ద నూ తనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఇం దులో భాగంగా తెల్లవారుజా మున 2 గంటల నుంచి నే త్రోన్మీలనం, మహా పూర్ణా హుతి, నెయ్యి అభిషేకం, మ హా కుంభాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గాండ్లపెంట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండల కేం ద్రంలోని చిన్నమిట్ట వద్ద నూ తనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఇం దులో భాగంగా తెల్లవారుజా మున 2 గంటల నుంచి నే త్రోన్మీలనం, మహా పూర్ణా హుతి, నెయ్యి అభిషేకం, మ హా కుంభాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అయ్యప్పస్వామిని దర్శించుకు న్నారు. ఆయనకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. దుశ్శాలువ కప్పి సత్కరించారు. అయ్యప్పస్వామి చిత్రపటా న్ని బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం అయ్యప్ప మహాపడి పూజ, భజనలు, వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్‌ఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....