MLA: రైతుకు వెన్నుదన్నుగా ప్రభుత్వం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:44 AM
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్ర సాద్ పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని హిందూపురం రోడ్డులో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రంలో బుధవారం ‘పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండో విడుత సహయాన్ని పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే కందికుంట
కదిరి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్ర సాద్ పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని హిందూపురం రోడ్డులో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రంలో బుధవారం ‘పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండో విడుత సహయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ... పీఎం కిసాన అన్నదాత సుఖీభవ పథకం కింద కదిరి నియోజకవర్గంలోని రైతులకు రూ. 30.18 కోట్ల లభ్ది చేకూరిందన్నారు. వైసీపీ అధినేత జగన కూట మి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామో లేదో పి ల్లల నుంచి పెద్దల వరకూ వెళ్ళి అడగాలని జగనకు హితవు పలికారు.
హద్దుదాటితే కౌన్సెలింగ్: ఎమ్మెల్యే
నియోజకవర్గంలోని ప్రతిపక్షనాయకులు హద్దులు దాటి మాట్లాడు తున్నారని ఎమ్మెల్యే కందికుంట మండిపడ్డారు. అలాంటి వారిని ఇన్నా ళ్లు సహించామని, ఇంక హద్దులు దాటితే కౌన్సెలింగ్‌తోనే సమాధానం చెబుతామని పేర్కొన్నారు. పట్టణంలోని వ్యవసాయ పరిఽశోధన కేంద్రం లో బుధవారం నిర్వహించిన పీఎం కిసాన - అన్న దాత సుఖీభవ కార్యక్రమం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజాస్వా మ్యంలో పాలక పక్షంతోపాటు ప్రతిపక్షం ముఖ్యమన్నారు. స్వేచ్ఛగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడానికి అవకాశమిస్తే, కొంత మంది నాయకులు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. హద్దులు దాటి ప్రవర్తించే వారి గురించి ఇప్పటికే పోలీసులకు చెప్పామ న్నారు. పలువురు మీడియా ప్రతిఽనిధులు కూడా తప్పుడు రాతలు రాస్తే అది స్థాయిలో సమాధానమిస్తామని హెచ్చరించారు. అక్రమ లేఅవుట్ల వ్యాపారం మోసపూరితమన్నారు. వాటిలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ప్రజలు నష్టపోతారన్నారు. ఇప్పటికైనా వారు మోసాన్ని మానుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిగురించి ఏచర్చకేనా తాము సిద్ధమన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారధి ఉన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....