Share News

MP: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు : ఎంపీ

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:58 PM

దేశ భవిష్యత్తు, నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. మం డలంలోని కురగుంట గ్రామంలో ఆర్ట్స్‌ కళాశాల ఎనఎస్‌ఎస్‌ యూనిట్‌-2, ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషన సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఎనఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంపు మంగళవారం ముగిసింది.

MP: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు : ఎంపీ
MP Ambika Lakshminarayana speaking at the event

అనంతపురం రూరల్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్తు, నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. మం డలంలోని కురగుంట గ్రామంలో ఆర్ట్స్‌ కళాశాల ఎనఎస్‌ఎస్‌ యూనిట్‌-2, ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషన సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఎనఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంపు మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎస్కేయూ ఎనఎస్‌ఎస్‌ పోగ్రాం కో ఆర్డినేటర్‌ మురళీధర్‌రావు, అర్బన బ్యాంకు చైర్మన మురళీధర్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సి పాల్‌ పద్మశ్రీ ముఖ్యఅథితులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ అంబికా మాట్లాడుతూ... స్వామి వివేకానంద అడుగు జాడల్లో యువత న డవాలన్నారు. విద్యార్థి దశ నుంచే సేవా మార్గం అలవరచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర- స్వ చ్ఛాంధ్ర కోసం ప్రజలు పాటుపడాలన్నారు. అనంతరం క్యాంపులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో ఎనఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ విష్ణుప్రియ, ఎస్సార్‌ ఎడ్యుకుషనల్‌ వ్యవస్థాపకులు సుంకర రమేష్‌, ఆర్ట్స్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సహదేవుడు, ఐకేసి కో ఆర్డినేటర్‌ జితేంద్ర, లెక్చరర్స్‌ శ్రీదేవి, శశాంక్‌మౌలి, ఆర్థిక అక్షరాస్యత కోర్డినేటర్‌ ప్రసిల్లా, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరికి సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కుల పంపిణీ

అనంతపురం అర్బన ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): నగరానికి చెందిన ఇద్దరికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మంగళవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అం దజేశారు. నగర శివారులోని క్యాంప్‌ కార్యాలయంలో రమాదేవికి రూ.54,333, ఉమాపతికి రూ.25166 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఎంపీ అంబికాకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 08 , 2025 | 11:58 PM