ICDS: తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:57 AM
బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సత్యవతి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలపై బుధవారం నల్లమాడలో అవగాహన ర్యాలీ ని ర్వహించారు. వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
నల్లమాడ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సత్యవతి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలపై బుధవారం నల్లమాడలో అవగాహన ర్యాలీ ని ర్వహించారు. వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన అధికారి రామచంద్ర, వెలుగు ఏపీఎం గోపాల్, అంగనవాడీ కార్యకర్తలు, రంగమ్మ, కమలమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, ఆరుణమ్మ, తల్లులు, పిల్లలు, ఆయాలు పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు: పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమని, డబ్బా పాలు వద్దని సీడీపీఓ గాయత్రి, సూపర్‌వైజర్ విజయ్‌కుమారి పేర్కొ న్నారు. మండలంలోని కొండకమర్ల గ్రామంలో బుధవారం తల్లిపాల వారో త్సవాలు నిర్వహించారు. పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సచివాలయ ఆవర ణంలో సమావేశం ఏర్పాటు చేసి, తల్లిపాల వల్ల కలిగే లాభలు వివరించారు. ఆరోగ్య సిబ్బంది బాలాజీనాయక్, షామూ, కార్యదర్శి మద్దిలేటిరెడ్డి, చంద్రశేఖర్, సర్పంచ అల్లాపల్లి శ్రావణి, సెక్టార్ ప రిధిలోనిఅంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు, తల్లులు పిల్లలు పాల్గొన్నారు.