TDP: సీఎం చిత్రపటానికి దివ్యాంగుల క్షీరాభిషేకం
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:00 AM
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిం చిన ఏడు వరాలపై మండలం లోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. వారు మంగళవారం ముందుగా బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముదిగుబ్బ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిం చిన ఏడు వరాలపై మండలం లోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. వారు మంగళవారం ముందుగా బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ‘సీఎం సార్... ధర్యవాదాలు’ అంటూ నినాదాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల క్లస్టర్ ఇనచార్జ్ తుమ్మల మనోహర్, టీడీపీ నాయకులు మల్లెల నారాయణస్వామి, చంద్రసేన, రఫీ, వేలూరి జయచంద్ర, చిన్న ఉత్తప్ప, అశోక్, గోపీ, గోవిందు తదితరులు పాల్గొన్నారు.