TDP: ఉత్సాహంగా సీఎం సభకు
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:09 AM
కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సభకు జిల్లా జనం పోటెత్తారు. ఉదయం నుంచే అన్నిదారుల్లో అనంతపురం వైపు కూటమి నేతలు, శ్రేణు లతో పాటు మహిళలు, ప్రజలు లక్షలాది మంది తరలివచ్చారు. అనంతపు రంలో కూటమి ప్రభుత్వం 15నెలల పాలన విజయాలపై ఏర్పాటుచేసిన సభ బంపర్‌హిట్ అయింది.
పుట్తపర్తి, సెప్టెంబరు10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సభకు జిల్లా జనం పోటెత్తారు. ఉదయం నుంచే అన్నిదారుల్లో అనంతపురం వైపు కూటమి నేతలు, శ్రేణు లతో పాటు మహిళలు, ప్రజలు లక్షలాది మంది తరలివచ్చారు. అనంతపు రంలో కూటమి ప్రభుత్వం 15నెలల పాలన విజయాలపై ఏర్పాటుచేసిన సభ బంపర్‌హిట్ అయింది. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌తో పాటు ఉమ్మడిజిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన జిల్లా అధ్యక్షులు సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ప్రసంగాలు ఉత్తేజాన్ని నింపాయి. ఇందులో చంద్రబాబు ప్రసంగించిన తీరు సభలో ఊపు వచ్చింది. 15నెలల పాలనపై కూటమి నిర్వహించిన తొలిసభ అదరగొట్టింది. సభ ముగిసిన వెంటనే గంటలకొద్దీ ట్రాఫిక్ బంద్ అయింది.
ధర్మవరం /కదిరి: టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది తరలివెళ్లారు.ఽ టీడీపీ నాయకులు సంధా రాఘవ, జింకా పురుషోత్తం, నాగూర్ హుస్సేన, కొత్తపేట ఆది, జింకల రాజన్న, జిల కరశీన తదితరులు ఆర్టీసీ బస్సుల్లో తరలివెళ్లారు. నాయకులు, కార్యకర్తలకు చిగిచెర్ల రోడ్డులో ఉన్న పద్మావతి కల్యాణ మండపంలో పరిటాల శ్రీరామ్ భోజన సౌకర్యం ఏర్పాటుచేశారు. ధర్మవరం పట్టణం పసుపు మయంగా మారింది.అలాగే కదిరి నియోజకవర్గం నుంచి బయలు దేరిన నాయకులు, కార్యకర్తలకు ముదిగుబ్బ మండలంలోని నాగారెడ్డిపల్లి వద్ద ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే పలువురు ప్రయివేటు వాహనాల్లో వెళ్లారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....