Share News

UTF: ఇనసర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించాలి

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:00 AM

ఇన సర్వీసు టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మ హేశకు వినతిపత్రం అందజేశారు.

UTF: ఇనసర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించాలి
UTF leaders protesting in Dharmavaram

యూటీఎఫ్‌ నాయకులు

ధర్మవరం/పుట్టపర్తి టౌన/ కదిరి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఇన సర్వీసు టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మ హేశకు వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రామకృష్ణనాయక్‌, ధర్మవరం డివిజన నా యకులు అంజనేయులు, అమర్‌నారాయణరెడ్డి, లక్ష్మయ్య, సురేశ, చంద్రశేఖర్‌, రాంప్రసాద్‌, లతాదేవి, నాగేంద్రమ్మ, యాస్మిన, సుల్తానా, శ్రీలత, రామాం జినేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పుట్టపర్తిలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిం చారు.


పుట్టపర్తి ఆర్డీఓ అనంతరం ఆర్డీఓ సువర్ణకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు లక్ష్మీనారాయణ, కందుకూరి శివ, బాబు, ఆదినారాయణ, పర్వతయ్య, రమేష్‌, బాబు, రాజేష్‌, తిరుపాలు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. కదిరి డివిజన కమిటీ ఆధ్వర్యంలో కదిరిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి డి. శ్రీనివాసులు, జిల్లా కార్య దర్శులు చెన్నూరు తాహేర్‌వలి, సుబ్బా రెడ్డి, జిల్లా నాయకులు మల్లికార్జున, ఆజం భాషా, సునీల్‌ కుమార్‌, సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వారు మాటా ్లడు తూ... యూటీఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇనసర్వీస్‌ టీ చర్లకు టెట్‌ నుంచి మినహాయింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో వెంటనే రివ్యూ పిటిషన చేయాలని, పార్లమెంట్‌లో ఆర్టీఈ యాక్డ్‌సెక్షన(1)ను సవరణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో సింగల్‌ టీచర్‌ సమస్యలను వెంటనే పరి ష్కరించాలన్నారు. ఇప్పటికే బదిలీలు పొంది వారి స్థానాల్లో కొత్త వారు రాక అక్కడే కొనసాగుతున్న టీ చర్లను వెంటనే బదిలీ స్థానాలకు రిలీవ్‌ చేయాలన్నా రు. రెండో శనివారం, ఆదివారాల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతులు నిర్వహించ రాదన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 11 , 2025 | 12:00 AM