Share News

Rayalacheruvu : రాయలచెరువులో ఉద్రిక్తత

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:22 AM

భూవివాదంతో రాయలచెరువులో బుధవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయలచెరువులో సర్వే నంబరు 650/బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌లోని 1.25 ఎకరాల స్థలంపై వివాదం నెలకొంది. రాయలచెరువుకు చెందిన మాదాల భాస్కర్‌ తల్లి పేరుతో భూమి ఉన్నట్లు రాయలచెరువు వాసులు చెబుతున్నారు. ఈ భూమిని వేరొక వ్యక్తితో తాము కొన్నామంటూ పులివెందులకు చెందిన ఒక ప్రముఖ నాయకుడి పేరు చెప్పి కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగారు. వివాద స్థలం వద్దకు బుధవారం సాయంత్రం వచ్చిన బయట వ్యక్తులు, రాయలచెరువు గ్రామానికి చెందిన వ్యక్తులు గొడవపడ్డారు. పరిస్థితి ఒకరిపై ఒకరు దాడిచేసుకొనే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి ...

Rayalacheruvu : రాయలచెరువులో ఉద్రిక్తత
Police accommodating both sides

ఇరువర్గాల ఘర్షణ

భూవివాదమే కారణం

యాడికి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): భూవివాదంతో రాయలచెరువులో బుధవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయలచెరువులో సర్వే నంబరు 650/బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌లోని 1.25 ఎకరాల స్థలంపై వివాదం నెలకొంది. రాయలచెరువుకు చెందిన మాదాల భాస్కర్‌ తల్లి పేరుతో భూమి ఉన్నట్లు రాయలచెరువు వాసులు చెబుతున్నారు. ఈ భూమిని వేరొక వ్యక్తితో తాము కొన్నామంటూ పులివెందులకు చెందిన ఒక ప్రముఖ నాయకుడి పేరు చెప్పి కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగారు. వివాద స్థలం వద్దకు బుధవారం సాయంత్రం వచ్చిన బయట వ్యక్తులు, రాయలచెరువు గ్రామానికి చెందిన వ్యక్తులు గొడవపడ్డారు. పరిస్థితి ఒకరిపై ఒకరు దాడిచేసుకొనే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల వారిని స్టేషనకు తీసుకువెళ్లారు. మంగళవారం ఇదే తరహా సంఘటన జరగడం గమనార్హం. ఇరువర్గాలను


పోలీ్‌సస్టేషనకు రమ్మని చెప్పిన పోలీసులు.. బుధవారం ఉదయం ఆధారాలతో పోలీ్‌సస్టేషనకు రావాలని చెప్పి పంపారు. బుధవారం ఉదయం రాయలచెరువు చెందిన వ్యక్తులు మాత్రమే పోలీ్‌సస్టేషనకు వెళ్లి ఫిర్యాదు చేసి వెళ్లారు. పులివెందులకు చెందిన ప్రముఖ నాయకుడి మనుషులమంటూ రాత్రి కొందరు వ్యక్తులు రాయలచెరువుకు వచ్చి సదరు స్థలం వద్ద వివరాలు ఆరా తీశారు. సమాచారం అందుకున్న రాయలచెరువుకు చెందిన వ్యక్తులు అక్కడికి వెళ్లడంతో ఇరువర్గాలు గొడవపడ్డాయి. పరస్పరం దాడి చేసుకున్నారు. రెండురోజుల నుంచి రాయలచెరువులో నెలకొన్న సమస్యతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 13 , 2025 | 12:22 AM