GOD: భక్తులతో ఖాద్రీశుడి ఆలయం కిటకిట
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:48 AM
దసరా ఉత్సవాలతో పాటు సెలవులు కావడంతో పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక నుంచి భక్తులు శుక్రవారం రాత్రే ఆల యానికి చేరుకున్నారు.
స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
కదిరి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాలతో పాటు సెలవులు కావడంతో పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక నుంచి భక్తులు శుక్రవారం రాత్రే ఆల యానికి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలను అందించగా, ఆలయాధికారులు అన్నదానం ఏర్పాటు చేశారు.