TDP: తెలుగు తమ్ముళ్ల సంబరాలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:20 AM
కడపజిల్లా పులివెం దుల, ఒంటి మిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడంపై తెలుగుతమ్ముళ్లు సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని హనుమాన కూడలిల లో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచాకాల్చి మిఠా యిలు తినిపించుకున్నారు.
పుట్టపర్తి రూరల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): కడపజిల్లా పులివెం దుల, ఒంటి మిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడంపై తెలుగుతమ్ముళ్లు సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని హనుమాన కూడలిల లో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచాకాల్చి మిఠా యిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ రత్నప్పచౌదరి, మాజీ జడ్పీటీసీ సభ్యులు చెన్నకేశవులు, నాయకులు అమ్మినేని కేశవనాయుడు, భీమినేని కిష్టప్ప, సునీల్, టీఎనఎస్‌ఎప్ రామాంజినేయులు, పీసీ గంగన్న, పాపారెడ్డి, పీట్ల రమణ, కేశప్ప, నారాయణ, నరసింహులు, తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అలాగే బుక్కపట్నం, నల్లమాడ, ఓబుళదేవరచెరువు, తనకల్లులో తెలుగుతమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....