TDP: టీడీపీ సభ్యత్వం కార్యకర్తలకు ఓ వరం
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:44 AM
కార్యకర్తలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ టీడీపీ సభ్యత్వం తీసుకున్నవారికి, బీమా సదుపాయం కల్పించం డం బాధిత కుటుంబాలకు ఓ వరంలా నిలుస్తోందని టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఇటీవల మం డలంలోని పోతుకుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గుజ్జల ఆదినరసింహులు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. అతడికి టీడీపీ సభ్యత్వం ఉండటంతో పరిటాలశ్రీరామ్ చొరవతో పార్టీ కార్యాల యం నుంచి ప్రమాద బీమా రూ.5లక్షలు మంజూరైంది.
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేసిన శ్రీరామ్
ధర్మవరం రూరల్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): కార్యకర్తలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ టీడీపీ సభ్యత్వం తీసుకున్నవారికి, బీమా సదుపాయం కల్పించం డం బాధిత కుటుంబాలకు ఓ వరంలా నిలుస్తోందని టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఇటీవల మం డలంలోని పోతుకుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గుజ్జల ఆదినరసింహులు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. అతడికి టీడీపీ సభ్యత్వం ఉండటంతో పరిటాలశ్రీరామ్ చొరవతో పార్టీ కార్యాల యం నుంచి ప్రమాద బీమా రూ.5లక్షలు మంజూరైంది. పట్టణం లోని టీడీపీ కార్యాలయంలో శనివారం మృతుడి భార్య లక్ష్మికి రూ. 5లక్షల చెక్కును పరిటాల శ్రీరామ్ అందజేశారు.
దీంతో ఆమె సీ ఎం చంద్రబాబు, నారా లోకేక్, పరిటాలశ్రీరామ్‌కు కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇనచార్జ్ మహేష్‌చౌదరి, తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు తలారి వెంకటలక్ష్మి, గ్రామకమిటీ అధ్యక్షుడు నారాయణస్వామి, నాయకులు రవి, ఐటీడీపీ రాము, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యానికి భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం
ధర్మవరం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ఉందని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదు కునేది టీడీపీ మాత్రమేనని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరి టాల శ్రీరామ్ పేర్కొన్నారు. అనంతపురంలోని క్యాంపు కార్యాల యంలో శనివారం ధర్మవరం నియోజకవర్గంలోని 25 మంది లబ్ధిదారులకు రూ.22.41లక్షల చెక్కులను పరిటాల శ్రీరామ్ పం పిణీచేశారు. టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, పరిశే సుధా కర్, పురుషోత్తంగౌడ్, రాళ్లపల్లి షరీఫ్, బీరే శీన పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....