TDP: పీఎంఏవై 2.0ను సద్వినియోగం చేసుకోండి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:47 PM
ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై2.0) పథకం కింద జియోట్యాగింగ్ చేయని వారికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవా లని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సూచించారు. పీఎంఏవై 2.0పై స్థానిక ఎర్రగుంట టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
టీడీపీ నియోజవకవర్గం ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్
ధర్మవరం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై2.0) పథకం కింద జియోట్యాగింగ్ చేయని వారికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవా లని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సూచించారు. పీఎంఏవై 2.0పై స్థానిక ఎర్రగుంట టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు. హౌసింగ్ ఇంజనీరింగ్ సిబ్బంది ద్వారా తమ స్థలాల్లో జియో ట్యాగింగ్ చేయించుకోవడం తప్పని సరి అని ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లకు జియో ట్యాగింగ్ అన్నది తప్పని సరి అని లేకపోతే లబ్ధిదారులు నస్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీటిపై నాయకులు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ఎవరు నష్టపోకుం డా చూడాలని పరిటాలశ్రీరామ్ సూచించారు. అదేవిధంగా నియోజ కవర్గ పరిధిలో ఏడుగురికి మంజూరైన రూ.4.77 లక్షలు విలువైన చెక్కులను ఆయన టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజే శారు. ఈ కార్యక్రమంలో టీడీపీనాయకులు కాట మయ్య, చింతలపల్లి మహేశచౌదరి, బీరే గోపాలక్రిష్ణ, పరిశే సుఽధాకర్, సంధా రాఘవ, నాగూర్ హుస్సేన, చింతపులుసు పెద్దన్న, పురుషోత్తంగౌడ్, రాళ్లపల్లి షరీఫ్, జింకా పురుషోత్తం, అంబటి సనత, కొత్తపేట ఆది, విజయ్ చౌదరి, మాధవరెడ్డి, కేశగాళ్ల శీన, చట్టా లక్ష్మీనారాయణ, కరెంటు ఆది, అస్లాం, అడ్రమహేశ, వరదరాజులు, మార్కెట్ రహీం పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....