EXCELLENCE: యోగాసన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:33 AM
రాష్ట్రస్థాయి ఆరో యోగాసన స్పోర్ట్స్ చాంపియన షిన పోటీలలో ధర్మవరం విద్యార్థులు ప్రతిభ కనబరచి బంగారు పతకాలు సాధించినట్టు యోగా అసోసియేషన జిల్లా అధ్యక్షుడు గాజుల సోమేశ్వరరెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
ధర్మవరం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ఆరో యోగాసన స్పోర్ట్స్ చాంపియన షిన పోటీలలో ధర్మవరం విద్యార్థులు ప్రతిభ కనబరచి బంగారు పతకాలు సాధించినట్టు యోగా అసోసియేషన జిల్లా అధ్యక్షుడు గాజుల సోమేశ్వరరెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న ధర్మవరం విద్యార్థులు మమత, అభిలాష్, యుగంధర్, రఘు, చేతనగౌడ్, జస్వనకుమార్, భానుకేశవ్ ప్రథమ స్థానంలో నిలిచి 4 బంగారు పతకాలు, ద్వితీయస్థానంలో 2, తృతీయ స్థానంలో 4, నాలుగో స్థానంలో 3, ఐదో స్థానంలో 3 బంగారు పతకాలు సాధించారన్నారు. వారిని సోమవారం గాజుల సోమేశ్వరరెడ్డితో పాటు అసోసియేషన సభ్యులు అభినందించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....